ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Climate Change: కార్మిక శక్తిపై ఉష్ణోగ్రతల ప్రభావం

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:13 AM

వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కార్మిక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2023లో అధిక వేడి కారణంగా భారత్‌లో కార్మిక సామర్థ్యం బాగా తగ్గిపోయిందని,

  • పెరిగిన వేడి వల్ల పని సామర్థ్యం తగ్గుదల

  • గతేడాది భారత్‌కు 12 లక్షల కోట్ల నష్టం

న్యూఢిల్లీ, అక్టోబరు 30: వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కార్మిక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2023లో అధిక వేడి కారణంగా భారత్‌లో కార్మిక సామర్థ్యం బాగా తగ్గిపోయిందని, దీనివల్ల రూ.11.85 లక్షల కోట్ల ఆదాయాన్ని భారత్‌ నష్టపోవాల్సి వచ్చిందని ‘లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఫర్‌ ఇండియా-2024’ నివేదిక వెల్లడించింది. వ్యవసాయ రంగానికి అత్యధికంగా రూ.6.04 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సహా ప్రపంచవ్యాప్తంగా 57 విద్యాసంస్థలు, ఐక్యరాజ్య సమితి సంస్థలకు చెందిన 122 మంది నిపుణులతో రూపొందించిన వార్షిక నివేదికను లాన్సెట్‌ బుధవారం వెల్లడించింది.


ఈ నివేదిక ప్రకారం బహిరంగ వేడి కారణంగా గతేడాది భారత్‌లోని ప్రజలు సగటున 2,400 పనిగంటలు లేదా 100 రోజుల పనిదినాలను కోల్పోయారు. ఇది 1990-1999 సగటుతో పోలిస్తే 50 శాతం అధికం. ఐక్యరాజ్యసమితి 29వ కాన్ఫరెన్స్‌ (సీవోపీ29)కు ముందు ప్రచురించిన ఈ నివేదిక.. వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో దేశాల వారీగా అంచనా వేసింది. 2014-2023 మధ్య కాలంలో శిశువులు, 65 ఏళ్లు పైబడివారు ఏడాదికి సగటున 7.7 నుంచి 8.4 రోజులపాటు వడగాడ్పులకు గురవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే 2000వ సంవత్సరం తర్వాత భారత్‌లో పునరుత్పాదక విద్యుత్‌శక్తి వినియోగం పెరిగిందని, 2022లో దేశంలోని విద్యుత్‌లో దీని వాటా 11ు అని తెలిపింది. దేశంలో 71ు విద్యుత్‌ ఇప్పటికీ బొగ్గు నుంచే వస్తోందని పేర్కొంది.

Updated Date - Oct 31 , 2024 | 05:13 AM