ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manipur: చురచంద్‌పుర్ ఘటన.. మెజిస్ట్రేట్ విచారణకు సీఎం ఆదేశం..

ABN, Publish Date - Feb 18 , 2024 | 02:49 PM

మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. చురచంద్‌పూర్ హింసాకాండపై విచారణ జరిపేందుకు మెజిస్టీరియల్ విచారణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. చురచంద్‌పూర్ హింసాకాండపై విచారణ జరిపేందుకు మెజిస్టీరియల్ విచారణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజా ఆస్తులు, ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అని బీరెన్ సింగ్ అన్నారు. జిల్లాలో హింసను ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. చురచంద్‌పూర్ హింసాకాండ యువతను ప్రేరేపించి, తప్పుదోవ పట్టించే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస కారణంగా దెబ్బతిన్న బంగ్లాకు మరమ్మతులు సహా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కార్యకలాపాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గురువారం రాత్రి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో హింసాత్మక నిరసన జరిగింది. భద్రతా బలగాల చర్య కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 25 మంది గాయాలయ్యాయి. ఐఆర్‌బీ క్యాంపు కార్యాలయం నుంచి దోచుకెళ్లిన నాలుగు ఇన్సాస్ రైఫిళ్లు, ఏకే ఘటక్ 2, ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగజైన్‌లు, 9 ఎంఎం మందుగుండు సామగ్రికి చెందిన పదహారు చిన్న పెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 02:49 PM

Advertising
Advertising