ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: అయోధ్యలో 22న 100 విమానాల ల్యాండ్ అవుతాయి: సీఎం ఆదిత్యనాథ్

ABN, Publish Date - Jan 11 , 2024 | 01:21 PM

అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అహ్మదాబాద్ - అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు.

అయోధ్య: అయోధ్యలో (Ayodhya Ram Mandir) ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అయోధ్య (Ayodhya) పురవీధులు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. 11 వేల మంది అతిథులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు రానున్నారు. అహ్మదాబాద్ - అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు.

ఈ నెల 22వ తేదీన అయోధ్యకు 100 చార్టెట్ విమానాల్లో అతిథులు హాజరవుతారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన అయోధ్యలో మహర్షి వాల్మికీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త ఎయిర్ పోర్టు వల్ల మరిన్ని విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లభించిందని ఆదిత్యనాథ్ చెబుతున్నారు. తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఐదు ఎయిర్ పోర్టులను ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. జామ్‌ఘర్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకోట్‌లో ఎయిర్ పోర్టుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

2014 వరకు ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఆరు ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని సింధియా తెలిపారు. అయోధ్య విమానాశ్రయాన్ని కలిపి 10కి చేరాయని వివరించారు. నెలరోజుల్లో మరో 5 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి జివార్‌‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుందని సింధియా వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 01:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising