ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Coffee: కాక రేపుతున్న ‘కాఫీ’.. అమాంతం పెరిగిన గింజల ధరలు

ABN, Publish Date - May 24 , 2024 | 01:32 PM

నిద్రలేవగానే బెడ్‌ కాఫీతో ఎంతోమంది రోజు ప్రారంభమవుతుంది. నలుగురు కలిస్తే కాఫీ(Coffee) తాగుదామా అనే మాటే వినిపిస్తుంది. అయితే కాఫీ ప్రియుల జేబులకు మరింత చిల్లులు పడే రోజులు వచ్చేశాయ్‌.

- కాఫీప్రియులకు భారం తప్పదు

- కర్ణాటక పంటకు ప్రపంచమంతటా డిమాండ్‌

- రాష్ట్రంలో 4లక్షల హెక్టార్లలో సాగు...

బెంగళూరు: నిద్రలేవగానే బెడ్‌ కాఫీతో ఎంతోమంది రోజు ప్రారంభమవుతుంది. నలుగురు కలిస్తే కాఫీ(Coffee) తాగుదామా అనే మాటే వినిపిస్తుంది. అయితే కాఫీ ప్రియుల జేబులకు మరింత చిల్లులు పడే రోజులు వచ్చేశాయ్‌. ప్రస్తుతం సాధారణ హోటళ్లలో రూ.15 నుంచి 20 రూపాయలు, కొంత విలాసవంతమైన రెస్టారెంట్‌లలో రూ.40-100 దాకా ధర ఉంది. కాఫీ పార్లర్‌, కెఫెలలో రూ.80 నుంచి రూ.800 దాకా కాఫీ వెలగా ఉంది. మరికొన్ని రోజుల్లోనే 5నుంచి10శాతం అంటే రూ.30-50కుపైగా కాఫీ ధర పెరగనుంది. క్వాలిటీ కాఫీ తాగాలంటే మరింత భారాన్ని భరించాల్సిందే. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచమంతటా కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గింది. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్‌, వియత్నాం(Brazil and Vietnam) లోనూ కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా కాఫీకి డిమాండ్‌ పెరిగింది. కాఫీ బోర్డ్‌ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లోనే 40,434 మెట్రిక్‌ టన్నుల కాఫీ విదేశాలకు ఎగుమతి అయ్యింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. ఇది దేశీయ కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్‌ను సూచిస్తుంది. విశ్వవ్యాప్తంగా భారీ డిమాండ్‌ రావడంతో కాఫీ గింజల ధరలు ఆకాశన్నంటాయి. ఈ ప్రభావం స్థానికంగాను కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఏప్రిల్‌ నెలలో కాఫీ గింజల ధరలు నాలుగుసార్లకు పైగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కాఫీపొడి డీలర్‌లు అభిప్రాయపడుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: భారీగా పెరిగిన పప్పుల ధరలు...


కర్ణాటక కాఫీ గింజలకు భలే డిమాండ్‌...

కర్ణాటకలో పండించే కాఫీ పంటకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ నెలకొంది. ఇండియన్‌ కాఫీ మార్కెట్‌ ఎప్పుడూ గ్లోబల్‌ మార్కెట్‌కు అనుగుణంగానే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినా తగ్గినా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం గ్లోబల్‌ స్థాయిలో కాఫీ ధరలు పెరిగిన తరుణంలో రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని కాఫీ బోర్డు సీఈఓ జగదీశ్‌ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కాఫీ గింజల ధరలు పెరగడంతో దేశంలోనూ ఆ ప్రభావం పడింది. కాఫీ తోటల రైతులకు ఇది సంతోషాన్ని కలిగించే అంశం. గడిచిన దశాబ్దన్నర కాలంలో కాఫీ గింజలకు ఈ స్థాయిలో ధరలు చేరలేదు. దేశవ్యాప్తంగా పండే కాఫీ గింజల్లో 71శాతం కర్ణాటకలోనే పండిస్తారు. ప్రధానంగా చిక్కమగళూరు, హాసన్‌, కొడగు, దక్షిణకన్నడ జిల్లాలతోపాటు అనుబంధ జిల్లాల్లో కొంతమేర సాగు అవుతుంది. మిగిలిన 21శాతం కేరళలోనూ, తమిళనాడులో 5శాతం సాగు చేస్తారు. అయితే కర్ణాటక కాఫీ గింజలు నాణ్యమైనవి కావడంతో డిమాండ్‌ అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 4లక్షల హెక్టార్లలో కాఫీ సాగు చేస్తారు. గత ఏడాది 3.52 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలు దిగుబడి సాధ్యమైంది.

- వారం క్రితం నాటి ధరలు కేజీల ప్రకారం రోబస్టా రూ.582, కాగా అరేబికా రూ.620 గా ఉంది. ఏప్రిల్‌ చివరివారంలో రోబస్టా రూ.448, అరేబికా రూ.483గా ఉండేది. వారం రోజుల వ్యవధిలోనే కిలోకు 150 రూపాయలకుపైగా ధర పెరగడం గమనార్హం. పెరుగుతున్న ధరలతో కాఫీ ప్రియుల్లో దిగులు మొదల్యైంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 01:32 PM

Advertising
Advertising