ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAS Prasanth: ఈ కలెక్టర్ బ్రో బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

ABN, Publish Date - Nov 12 , 2024 | 06:07 PM

ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు.

IAS Officer Prasanth

సీనియర్ ఐఏఎస్ అధికారి జయతిలక్‌పై మరో ఐఏఎస్ అధికారి ఎన్ ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేరళలోని పినరయ్ రవి ప్రభుత్వం అతడిపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. దాంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఐఏఎస్ అధికారి ఎన్ ప్రశాంత్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడిని సోషల్ మీడియాలో అంతా కలెక్టర్ బ్రో అని పిలుచుకుంటారు. ప్రశాంత్‌కి ఫేస్ బుక్‌లో 3 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్‌లో 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అతడు స్పందించే విధానానికి రాజకీయ నాయకులు సైతం ఫిదా అయిపోయారన్న సంగతి అందరికి తెలిసిందే.

Also Read: Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక


ఎవరికైనా సహాయం చేయాలన్నా.. ప్రజలకు పిలుపు ఇవ్వాలన్నా.. ఇంకా చెప్పాలంటే ప్రజలకు సులువుగా చేరేందుకు అత్యంత సులువైన మార్గం సోషల్ మీడియా అని ఆయన బల్లగుద్దీ మరి చెబుతారు. అందుకే ఆయన ఏరీ కోరి మరి ఏ విషయాన్ని అయినా.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.


ప్రశాంత్ బ్యాక్ గ్రౌండ్...?

ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు.


కలెక్టర్ బ్రో..

ఆ తర్వాత కేరళలో పలు ఉద్యోగాలు చేపట్టారు. ఆ క్రమంలో 2015లో కోజికోడ్ జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో నాటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలకు చేరువ కావడం ప్రారంభించారు. దీంతో ఆయన్ని నెటిజన్లు కలెక్టర్ బ్రో అంటూ పిలుచుకోవడం ప్రారంభించారు.


కొన్ని ఉదాహరణలు...

14 ఎకరాల చెరువును శుభ్రం చేసేందుకు తరలి రావాలంటూ.. ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. అలా వచ్చిన వారికి మలబార్ బిర్యానీ పార్టీ ఇస్తానంటూ వాగ్దానం చేశారు. అదికూడా ఫేస్ బుక్ వేదికగా పిలుపు ఇవ్వడంతో భారీగా స్పందన వచ్చింది. అంతే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికి బిర్యానీ పార్టీ ఇచ్చారు.


అలాగే కంపాసినేట్ కోజికోడ్, ఆపరేషన్ సులైమానితోపాటు మానసిక అనారోగ్యంతో బాధ పడేవారి కోసం ఆయన వివిధ కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఇక కోజికోడ్‌లో హోటళ్లు, రెస్టారెంట్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చి.. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు భోజనం అందించేందుకు పలు కార్యక్రమాలను ప్రశాంత్ శ్రీకారం చుట్టారు.


అనుభవాలకు పుస్తక రూపం..

"కలెక్టర్ బ్రో: ది క్విక్సోటిక్ 'తల్లాల్స్' ఆఫ్ సివిల్ సర్వెంట్" అనే పుస్తకాన్ని సైతం ప్రశాంత్ రాశారు. ఈ పుస్తకంలో కోజికోడ్ జిల్లాలో తన పరిపాలనకు సంబంధించిన అనుభవాలను సోదాహరణగా వివరించారు. ఆ తర్వాత వివిధ శాఖల్లో కీలక శాఖల కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహించారు. ఇక ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఎన్ ప్రశాంత్‌ పని చేస్తున్నారు.


విజిల్‌బ్లోయర్

ఇక ప్రశాంత్ విజిల్ బ్లోయర్‌గా అభివర్ణించుకుంటారు. ఆ క్రమంలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జయతిలక్‌ను "సైకోపాత్"గా ఆయన అభివర్ణించారు. తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేశారని ఆరోపించారు. అయితే ప్రభుత్వ చర్య కారణంగా తనను తాను "విజిల్‌బ్లోయర్"గా ప్రశాంత్ సమర్థించుకున్నారు. తనకు ఐఏఎస్ అధికారి కావడమే ఏకైక లక్ష్యం కాదని.. ఇతర వ్యక్తిగత ఆసక్తులు సైతం ఉన్నాయని తెలిపారు.


జయతిలక్.. తన సూచనలను పాటించని సబార్డినేట్‌ల కెరీర్‌ను నాశనం చేశారని ప్రశాంత్ మండిపడ్డారు. ప్రభుత్వ విషయాలను బహిరంగంగా వెల్లడించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. కానీ ఈ విషయం తెలుసుకోవడం ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా పలు అంశాలను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వివరించారు. అలాగే ప్రశాంత్‌పై సీపీఎం నేత, మాజీ మంత్రి జె మెర్సీ కుట్టి సైతం పలు ఆరోపణలు గుప్పించారు.


ప్రశాంత్‌తోపాటు మరో ఐఏఎస్ అధికారిపై..

ఇక ప్రశాంత్‌తోపాటు మరో ఐఏఎస్ అధికారి కె. గోపాలకృష్ణన్‌పై సైతం కేరళ ప్రభుత్వం సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. మతపరమైన వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారనే కారణంగా ఆయనపై ఈ వేటు వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రచారం అయితే సాగుతుంది.

For National News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 06:49 PM