ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPSC aspirants’ death: ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్

ABN, Publish Date - Jul 29 , 2024 | 01:57 PM

ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా.. ఓల్డ్ రాజేంద్రనగర్‌లో వరద నీరు పోటెత్తింది. దీంతో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఈ ఘటనలో ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి మందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా.. ఓల్డ్ రాజేంద్రనగర్‌లో వరద నీరు పోటెత్తింది. దీంతో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఈ ఘటనలో ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి మందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Also Read:Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి


వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో.. లోపలున్న విద్యార్థులు బయటకు వస్తున్న దృశ్యాలు నీటిలో నుంచి మెట్లు ద్వారా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్న విద్యార్థులు త్వరగా. త్వరగా బయటకు రావాలని ఓ వ్యక్తి సూచించడంతోపాటు.. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక లోపల ఉన్న విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద నీరు.. వారిని చుట్టుముట్టి ఉంటుందని పోలీసులు సైతం భావిస్తున్నారు.

Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు


ఈ ప్రమాద ఘటనపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఘటనకు సంబంధించి భవనం యజమాని, కో ఆర్డినేటర్‌తోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 13 కోచింగ్ సెంటర్లను ఢిల్లీ నగర పాలిక సంస్థ అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందించారు.

Also Read: Jharkhand: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ను సమర్థించిన సుప్రీం ధర్మాసనం


లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే.. ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అయితే..ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడుతుంది. దేశ రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనలో లోపం.. ఈ ఘటన ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తుంది.

Also Read: UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం


అంతేకాదు... ఇది ప్రభుత్వ చేసిన హత్య అన్నట్లుగా బీజేపీ అభివర్ణిస్తుంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా.. ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. తానియా సోని (25), శ్రియా యాదవ్ (25), నవీన్ డెల్విన్ (25) మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 01:57 PM

Advertising
Advertising
<