ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangladesh Land Pact: మోదీకి కౌంటర్‌గా.. తెరమీదకి బంగ్లాదేశ్ భూ ఒప్పందం

ABN, Publish Date - Mar 31 , 2024 | 08:30 PM

1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బంగ్లాదేశ్ భూ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.

1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) బంగ్లాదేశ్ (Bangladesh) భూ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. 2015 నుంచి బంగ్లాదేశ్‌తో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన భూ సరిహద్దు ఒప్పందంలో భాగంగా.. 10,051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే వచ్చాయని అన్నారు. ఆ సమయంలో తాము ప్రధాని మోదీపై చైల్డిష్ ఆరోపణలు చేయకుండా.. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు.

Mamata Banerjee: బీజేపీకి మమతా బెనర్జీ సవాల్.. ఎన్నికల్లో 200 సీట్లు దాటితే..


క‌చ్చతీవు అంశాన్ని ప్రధాన హైలైట్ చేయడం.. ఎన్నికల ముందు బీజేపీ (BJP) పన్నిన వ్యూహం అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో (Tamil Nadu) సున్నా సీట్లు రావడంతో.. ప్రధాని మోదీ, అతని డ్రమ్మర్లు నిరాశకు గురయ్యారని సెటైర్లు వేశారు. తమిళనాడులో దారి మళ్లింపు చర్యలను సృష్టించేందుకే.. అన్నామలై (Annamalai) ఆర్‌టీఐ అప్లికేషన్‌ని దాఖలు చేశారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ఆర్టీఐ లక్షలాది ప్రశ్నలు సంధించిందని.. కానీ వాటిని పక్కన పెట్టేసి, కేవలం కచ్చతీవు సమస్యకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ లభించిందని, దానికి ప్రధాని మోదీ నుంచి వేగంగా సమాధానం రావడం మరింత విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్‌టీఐ ప్రత్యుత్తరాన్ని అన్నామలై ప్రస్తావించిన తర్వాత ప్రధాని మోదీ ఈ అంశాన్ని హైలైట్ చేశారని.. ఎన్నికల ముందు బీజేపీ మ్యాక్-ఫిక్సింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించారు.

PM Narendra Modi: ప్రధాని మోదీకి డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్.. 50 ఏళ్ల నాటి సమస్యపై..

1974లో సిరిమావో బండారునాయకే, ఇందిరా గాంధీ (Indira Gandhi) మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా.. శ్రీలంక నుంచి 6 లక్షల మంది తమిళ ప్రజలు తిరిగి స్వదేశానికి వచ్చారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ ఒక్క ఎత్తుగడతో.. దేశం లేని ఆ 6 లక్షల మందికి మానవ హక్కులు, గౌరవం లభించాయని తెలిపారు. ఇదే సమయంలో.. భారత్, చైనా మధ్య కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ మోదీపై చురకలంటించారు. దేశ సమగ్రతకు నిజమైన ముప్పు.. గత కొన్ని సంవత్సరాలుగా భారత భూభాగాన్ని చైనా ఆర్మీ పెద్దఎత్తున ఆక్రమించడమని కౌంటర్ వేశారు. స్వయంగా బీజేపీ ఎంపీలు భారత భూభాగంలోకి చైనా చొరబడిందని ధృవీకరించినప్పటికీ.. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 09:12 PM

Advertising
Advertising