Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..
ABN, Publish Date - May 12 , 2024 | 01:09 PM
ఎన్నికల పోలింగ్ వేళ.. ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, మే 12: ఎన్నికల పోలింగ్ వేళ.. ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులు తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
అయితే ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ నేతలు మాత్రం సులువుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించింది. బిహార్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఈ మేరకు ఆదివారం ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే.. శనివారం బిహార్‌లోని సమస్తిపూర్, ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌లో ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
అలాగే ఈ వీడియోను బిహార్‌లోని ఎన్నికల సంఘం సీఈవోకు సైతం ఆయన షేర్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతల హెలికాఫ్టర్లను మాత్రమే ఇలా తనిఖీలు చేస్తారా? లేకుంటే ఎన్డీయేలోని అగ్రనేతలను సైతం ఇదే తరహాలో తనిఖీలు నిర్వహిస్తారా? అనేది స్పష్టం చేయాలని బిహార్‌లోని ఈసీ సీఈవోను కోరారు.
AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక
ఇలా అన్ని రాజకీయ పార్టీల నేతలను తనిఖీ చేసిన వీడియోలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుంటే ప్రతిపక్ష పార్టీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను సైతం అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విధంగా స్పందించింది.
Read Latest National News And Telugu News
Updated Date - May 12 , 2024 | 01:18 PM