ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ.. పోలీసుల మోహరింపు

ABN, Publish Date - Feb 20 , 2024 | 11:42 AM

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కొనసాగుతున్న కేసులో రాహుల్ గాంధీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం ఉదయం కొద్దిసేపు నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.


బెంగళూరులో 2018 విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)పై "అభ్యంతకరమైన" వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2018లో బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు(defamation case) దాఖలు చేశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హయాంలో జరిగిన హత్య కేసులో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(jairam ramesh) స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పట్టాలు తప్పదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి వాటికి రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ బెదిరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 11:42 AM

Advertising
Advertising