ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kolkata: అప్పటి కంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం.. లోక్‌సభ ఎన్నికలపై చిదంబర జోస్యం

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:20 PM

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2019తో పోల్చితే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) జోస్యం చెప్పారు.

కోల్‌కతా: రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2019తో పోల్చితే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) జోస్యం చెప్పారు. కోల్‌కతాలో ఆయన మాట్లాడుతూ..

"2019 కంటే వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి ఎక్కువ సీట్లు సాధిస్తుంది. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుంది. దేశంలో హిందూ మతానికి, హిందువులకు ఎలాంటి ముప్పు లేదు. ప్రధాని మోదీ(PM Modi) హిందుత్వను రక్షిస్తున్నట్లుగా చూపడానికి.. ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది బీజేపీ అవలంబిస్తున్న ఓ వ్యూహం. ఈ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని ఢీ కొట్టబోతున్నారు. రాష్ట్రంలో దీదీ మరోసారి పట్టు నిలుపుకుని ఇండియా కూటమిని బలోపేతం చేస్తుంది. కేరళలో రెండు ఫ్రంట్‌లు (యుడీఎఫ్, ఎల్‌డీఎఫ్) 20 సీట్లను గెలుచుకుంటాయి. అక్కడ బీజేపీకి ఒక్క సీటూ రాదు.


కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. చివరి సారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మేం గెలుచుకోబోయే స్థానాలపై మాకు ఒక అంచనా ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలలో ఇండియా కూటమి గణనీయమైన సీట్లలో విజయఢంకా మోగిస్తుంది.

Delhi: ప్రధాని మోదీ ఆడిన ఈ గేమ్ ఏంటో మీకు తెలుసా..

ప్రతిపక్షాలవి బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలని చెప్పడం బీజేపీ వ్యూహంలో భాగం. వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కచ్చతీవు సమస్య ముగిసిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏంటి. 50 ఏళ్ల క్రితం ఒప్పందం కుదిరింది. 2014 నుంచి మోదీ అధికారంలో ఉన్నారు.. గత 10 ఏళ్లుగా ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు" అని చిదంబరం ప్రశ్నించారు. కచ్చతీవు సమస్య తమిళనాడు, శ్రీలంకలోని రామేశ్వరం మధ్య ఉన్న ద్వీపం చుట్టూ దశాబ్దాల నాటి ప్రాదేశిక, ఫిషింగ్ హక్కుల వివాదానికి సంబంధించినది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 03:24 PM

Advertising
Advertising