Container lorry: ఆ కంటైనర్ లారీ నిండా నోట్ల కట్టలు.. ఇంతలోనే ప్రమాదం.. తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో..
ABN, Publish Date - Mar 23 , 2024 | 11:05 AM
పుదుచ్చేరిలో శుక్రవారం కరెన్సీనోట్ల కట్టల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ(Container lorry) ప్రమాదానికి గురైంది. ఆ కంటైనర్ నిండుగా నోట్ల కట్టలున్నాయని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు.
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో శుక్రవారం కరెన్సీనోట్ల కట్టల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ(Container lorry) ప్రమాదానికి గురైంది. ఆ కంటైనర్ నిండుగా నోట్ల కట్టలున్నాయని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. పోలీసులు జరిపిన విచారణలో నైవేలిలోని ఓ జాతీయ బ్యాంక్ సేకరించిన నోట్ల కట్టలను ఆ కంటైనర్ ద్వారా చెన్నై(Chennai)లో రిజర్వు బ్యాంక్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ఆ కంటైనర్ లారీకి ముందు వెనుక పోలీసులు రెండు వాహనాల్లో సెక్యూరిటీగా వెళ్లారు. ఆ కంటైనర్ లారీ పుదుచ్చేరి మరపాలం వద్ద వెళుతుండగా అదుపు తప్పి ముందు వెళ్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొంది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణించిన పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో కంటైనర్ లారీ నిలవడంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ జరిపారు. ఆ కంటైనర్‌లో కరెన్సీ నోట్ల కట్టలున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం దావానలంలా పుదుచ్చేరి(Puducherry) నగరమంతటా పాకింది. దీనితో వందల సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత ఆ కంటైనర్ చెన్నైకి బయలుదేరింది. అప్పటి వరకూ ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Updated Date - Mar 23 , 2024 | 11:05 AM