ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

contract killer: ‘సుపారీ’ సొమ్ము ఇప్పించండి!

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:15 AM

పోలీసు స్టేషన్‌లో హంతకులు లొంగిపోవడం సహజమే అయినా ఈ సంఘటన మాత్రం కాస్త విచిత్రంగా ఉంది. తనకు రావాల్సిన సుపారీని ఇప్పించాలంటూ ఓ ‘కాంట్రాక్టు కిల్లర్‌’ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది.

  • ఇస్తామన్నది ఇంకా చెల్లించలేదు

  • పోలీసు స్టేషన్‌లో ‘కాంట్రాక్టు కిల్లర్‌’ ఫిర్యాదు

  • యూపీలో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో మలుపు

  • అత్తింటివారే సుపారీ ఇచ్చినట్లు వెల్లడి

మేరఠ్‌, నవంబరు 8: పోలీసు స్టేషన్‌లో హంతకులు లొంగిపోవడం సహజమే అయినా ఈ సంఘటన మాత్రం కాస్త విచిత్రంగా ఉంది. తనకు రావాల్సిన సుపారీని ఇప్పించాలంటూ ఓ ‘కాంట్రాక్టు కిల్లర్‌’ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. ఓ మహిళ హత్యకు తనను పురమాయించిన ఆమె అత్తింటివారు.. పని పూర్తి చేసినా ఇంతవరకు ఇస్తామన్న సుపారీ చెల్లించలేదని, ఆ బకాయిలను ఇప్పించాలని కోరాడు. ఈ సంఘటనతో ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఏడాది క్రితం జరిగిన మహిళా న్యాయవాది అంజలి హత్య కేసు మలుపు తిరిగింది. ఆమెను హత్య చేసేందుకు భర్త, అత్తింటి వారు తనకు రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు వాటిని చెల్లించలేదని నీరజ్‌ శర్మ అనే నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


సంఘటన జరిగిన రోజున న్యాయవాది అంజలి మిల్క్‌ బూత్‌ నుంచి వస్తుండగా ఇద్దరు హంతకులు ఆమెను కాల్చి చంపారు. దర్యాప్తు జరిపిన పోలీసులు నీరజ్‌ శర్మ, యశ్‌పాల్‌ అనే హంతకులను అరెస్టు చేశారు. వారు వినియోగించిన రెండు స్కూటర్లు, పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. భర్త, కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేసినా వారి ప్రమేయం లేదంటూ అనంతరం వారిని విడిచిపెట్టారు. ఇటీవల బెయిల్‌పై విడుదలయిన నీరజ్‌ శర్మ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అంజలి భర్త, మామ పవన్‌ గుప్త, అత్త సరళా గుప్తలపై ఫిర్యాదు చేశారు. తాము కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనూ వారి పేర్లను వెల్లడించలేదని చెప్పాడు.

Updated Date - Nov 09 , 2024 | 05:15 AM