Delhi Excise policy: సిసోడియాకు మళ్లీ నిరాశ.. రెగ్యులర్ బెయిలుకు కోర్టు నిరాకరణ
ABN, Publish Date - Apr 30 , 2024 | 06:37 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy)కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్కామ్‌లో సిసోడియా కీలక సూత్రధారి అని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలను తారుమారు చేయడం, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని దర్యాప్తు సంస్థలు వాదన వినిపించాయి. గతంలోనూ సిసిడోయాకు బెయిల్ ఇచ్చేందుకు దిగువ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు నిరాకరించాయి.
Supreme Court: కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు
హైకోర్టుకు వెళ్లనున్న సిసోడియా
కాగా, రెగ్యులర్ బెయిల్‌కు రౌస్ అవెన్యూ నిరాకరించినందున హైకోర్టుకు సిసోడియా వెళ్లనున్నట్టు 'ఆప్' వర్గాలు తెలిపాయి. ఈ కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 06:37 PM