Credit Card Debt: క్రెడిట్ కార్డు బకాయిలకు భారీ వడ్డీ చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:14 AM
క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఇది దుర్వార్తే! బకాయిలపై భారీగా వడ్డీ చెల్లించక తప్పదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 21: క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఇది దుర్వార్తే! బకాయిలపై భారీగా వడ్డీ చెల్లించక తప్పదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. క్రెడిట్ కార్డుల బకాయిలు ఉంటే గతంలో బ్యాంకులు 35% నుంచి 50% వరకు వడ్డీ వసూలు చేసేవి. దీనిని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన కేసులో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీర్పు ఇస్తూ ఇంత శాతం వడ్డీ మరీ ఎక్కువని, అన్యాయమని అభిప్రాయపడింది. వడ్డీ 30 శాతానికి మించకూడదని పరిమితి విధించింది. దీనిపై బ్యాంకులు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాయి. శుక్రవారం ధర్మాసనం తీర్పు ఇస్తూ ఫోరం ఆదేశాలను కొట్టివేసింది. 30 శాతం పరిమితిని ఎత్తివేసింది. బ్యాంకులు తమ నిర్ణయం మేరకు 30 శాతానికి మించి వడ్డీ రేటు విధించేందుకు అవకాశం కలిగించింది.
Updated Date - Dec 22 , 2024 | 02:27 AM