ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Exams Postponed: లోక్‌స‌భ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. ఆ ప‌రీక్ష‌లు వాయిదా?

ABN, Publish Date - Mar 17 , 2024 | 11:33 AM

దేశంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మొద‌టిద‌శ పోలింగ్ ఏప్రియ‌ల్ 19న ప్రారంభ‌మై.. జూన్‌1న చివ‌రి ద‌శ పోలింగ్‌తో ఎన్నిక‌లు (Elections) ముగుస్తాయి. జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. ఈ ద‌శ‌లో ఏప్రియ‌ల్‌, మే నెల‌లో జ‌ర‌గాల్సిన కొన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌నున్నాయి.

దేశంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మొద‌టిద‌శ పోలింగ్ ఏప్రియ‌ల్ 19న ప్రారంభ‌మై.. జూన్‌1న చివ‌రి ద‌శ పోలింగ్‌తో ఎన్నిక‌లు (Elections) ముగుస్తాయి. జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. ఈ ద‌శ‌లో ఏప్రియ‌ల్‌, మే నెల‌లో జ‌ర‌గాల్సిన కొన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వ‌హించే కామ‌న్ యూనివ‌ర్సిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2024 తేదీల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. మే 15 నుంచి 31 మ‌ధ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తాత్కాలిక షెడ్యూల్‌ను గ‌తంలోనే ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల దృష్ట్యా అవ‌స‌ర‌మైతే ఆ తేదీల‌ను స‌వ‌రిస్తామ‌ని పేర్కింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌డంతో కామ‌న్ యూనివ‌ర్సిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (CUET UG 2024) ప‌రీక్ష‌లు వాయిదాప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పరీక్ష తేదీలను మారుస్తామని ఈనెల‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు .

ICAI ప‌రీక్ష‌లు వాయిదా..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) మే నెల‌లోలో నిర్వ‌హించాల్సిన‌ CA ఇంటర్మీడియట్ ఫైన‌ల్ ఎగ్జామ్‌ను వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్‌ను మార్చి 19న ICAI ప్ర‌క‌టించ‌నుంది.

య‌ధావిధిగా నీట్‌

మ‌రోవైపు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైద్య క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించ‌నున్న నీట్ యూజీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. మే5 వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్ష తేదీల మార్పుపై ఎన్టీఏ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2024 | 01:07 PM

Advertising
Advertising