Cyclone Remal: నలుగురు మృతి
ABN, Publish Date - May 27 , 2024 | 03:57 PM
రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్‌లోని కీపుపారా మధ్య తీరాన్ని దాటింది. అయితే ఈ తుపాన్ దాటికి.. భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కోల్‌కతా, మే 27: రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్‌లోని కీపుపారా మధ్య తీరాన్ని దాటింది. అయితే ఈ తుపాన్ దాటికి.. భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కోల్‌కతాలోని బిబి బగాన్‌లో పాత భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా.. దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మౌసునీ ఐలాండ్‌లో చెట్టు మీద పడి ఓ మహిళ మరణించింది. రెమాల్ తుపాన్.. ఉత్తరం, ఈశాన్యంగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
Pen Drive Videos: పోలీసులకు డేట్.. టైమ్.. చెప్పిన ప్రజ్వల్
మరోవైపు కోల్‌కతా ఎయిర్ పోర్ట్‌లో విమాన సర్వీసులను పునరుద్దరించారు. రెమాల్ తుపాన్ కారణంగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు ఆ యా ప్రభుత్వం తరలించిన సంగతి తెలిసిందే. ఇక ఈ తుపాన్ దాటికి బంగ్లాదేశ్‌లో సైతం ఇద్దరు మరణించారు. ఈ తుపాన్ కారణంగా బెంగాల్‌లోని తీర ప్రాంతాల జిల్లాలతోపాటు బంగ్లాదేశ్‌లో సైతం ఈదురు గాలుల బలంగా వీచాయి.
MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు
దీంతో భారీ వృక్షాలు రహదారులపై నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు రెమాల్ తుపాన్ నేపథ్యంలో ఆదివారం న్యూడిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పశ్చిమ బెంగాల్‌పై ఈ తుపాన్ తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రప్రభుత్వంతో నిత్యం చర్చలు జరపాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి ప్రధాని సూచించిన విషయం తెలిసిందే.
Read Latest National News and Telugu News
Updated Date - May 27 , 2024 | 04:53 PM