ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayodhya Deepotsav 2024: అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం.. 25 లక్షల పైగా దీపాలతో గిన్నిస్ రికార్డు

ABN, Publish Date - Oct 30 , 2024 | 08:07 PM

అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది.

లక్నో: బాలరాముడు కొలువైన అయోధ్యలో దీపావళి సంబరాలు కన్నులపండువగా మొదలయ్యాయి. సరయూ నదీ తీరంలో ఎనిమిదేళ్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తు్న్న 'దీపోత్సవం' ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత జరిగిన తొలి దీపోత్సవం ఇదే కావడంతో అయోధ్య నగరం దీపకాంతులతో మెరిసిపోయింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'దీపోత్సవ్'ను ప్రారంభించగా, భక్తులు ఏకకాలంలో 25 లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సరయూ నది ఘాట్‌లో 1,100 మంది హారతులు ఇవ్వడం ద్వారా మరో సరికొత్త రికార్డు కూడా సిద్ధమైంది.

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి


అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది. మయన్మార్, నేపాల్, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్, ఇండోనిషా, భారతీయ కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అయోధ్య వెలిగిపోతోంది..

రామాలయ నిర్మాణం తర్వాత జరిగిన తొలి దీపోత్సవ్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభిస్తూ, ఈనాటి దీపోత్సవ్ మనందరికీ గర్వకారణమని అన్నారు. ఇది మనమంతా జరుపుకుంటున్న 8వ దీపోత్సవమని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం తొలి దీపోత్సవ్ జరుపుతున్నప్పుడు... యోగీజీ రామమందిరం నిర్మించడని ప్రతి ఒక్కరూ అడిగేవారని, రాముడు త్వరలోనే మనందరికీ ఆశీర్వదిస్తాడని ఆరోజు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. రామాలయ నిర్మాణం కలసాకారమైనందుకు ప్రధాని మోదీకి మనమంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. యావద్దేశం కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ప్రధాని అయోధ్యకు వచ్చిన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. ఈరోజు అయోధ్య వెలిగిపోతోందని, ఇవాళ వెలుగుతున్నవి కేవలం దివ్వెలు కావని, సనాతన ధర్మ విశ్వాసని చెప్పారు. ''ఈరోజు మన కాశీ వెలిగిపోతోంది. భవ్య కాశీని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తోంది'' అని గర్వంగా చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో కలిసి టూరిజం యాప్‌ను, అయోధ్య మేయర్ రాసిన ఒక పుస్తకాన్ని యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు.


Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Arvind Kejriwal: దీపావళికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ షాక్

For National News And Telugu News...

Updated Date - Oct 30 , 2024 | 08:10 PM