ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్లు

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:52 AM

దేశంలోని కేన్సర్‌ రోగుల్లో దాదాపు 26ు మందికి తల, మెడలో కణితులు ఉన్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది.

  • భారత్‌లో 26% కేసులు ఇవే: నివేదిక

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలోని కేన్సర్‌ రోగుల్లో దాదాపు 26ు మందికి తల, మెడలో కణితులు ఉన్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ మార్చి 1 నుంచి జూన్‌ 30 వరకూ తన హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వచ్చిన కాల్‌ డేటాను క్రోడీకరించి అధ్యయనం నిర్వహించింది.

దేశవ్యాప్తంగా 1,869 మంది రోగులపై నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను శనివారం ప్రపంచ తల, మెడ కేన్సర్‌ దినం సందర్భంగా విడుదల చేసింది. పొగాకు వినియోగంతో పాటు హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ల కారణంగా దేశంలో తల, మెడ కేన్సర్‌ కేసులు, ప్రత్యేకంగా యువకుల్లో బాగా పెరుగుతున్నాయని కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ప్రచారానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆశిశ్‌ గుప్తా తెలిపారు.

కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయిలో ఉచిత హెల్ప్‌లైన్‌ 93-555-20202ను ఇటీవలే ప్రారంభించారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ పనిచేసే ఈ నంబర్‌కు కేన్సర్‌ రోగులు కాల్‌ చేసి ప్రముఖ అంకాలజిస్టులతో నేరుగా మాట్లావచ్చు.

Updated Date - Jul 28 , 2024 | 03:52 AM

Advertising
Advertising
<