Delhi:నితీన్ త్యాగిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్
ABN, Publish Date - Jun 07 , 2024 | 07:42 PM
ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను పార్టీ అన్వేషిస్తుంది. ఆ క్రమంలో ‘ఆప్’ ఓటమికి కారణాల్లో మాజీ ఎమ్మెల్యే నితీన్ త్యాగి ఒకరని ఆ పార్టీ గుర్తించింది.
న్యూఢిల్లీ, జూన్ 07: ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను పార్టీ అన్వేషిస్తుంది. ఆ క్రమంలో ‘ఆప్’ ఓటమికి కారణాల్లో మాజీ ఎమ్మెల్యే నితీన్ త్యాగి ఒకరని ఆ పార్టీ గుర్తించింది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ శుక్రవారం ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు సైతం జారీ చేశారు.
Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..
త్యాగి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తున్నట్లు ఆయన జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో త్యాగి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు అందాయని.. అందుకే ఈ చర్య తీసుకున్నట్లు గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. మరోవైపు తనపై పార్టీ సస్పెన్షన్ వేటు పడడంపై త్యాగి స్పందించారు. ప్రస్తుత రోజుల్లో నిజం చెబితే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటున్నారంటూ త్యాగి పేర్కొన్నారు. ఇక అతడిపై క్రమశిక్షణ చర్యలు ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీ వెల్లడించింది.
Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి
Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన
Also Read: Breaking: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము
For Latest News and National News click here
Updated Date - Jun 07 , 2024 | 07:42 PM