ED: ఈడీ ముందుకు రాని కేజ్రీవాల్, హేమంత్ సోరెన్.. తరువాత ఏమవుతుందంటే?
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:44 AM
కేసుల విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్(CM Kejriwal) కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemanth Sorean)కు ఈడీ జారీ చేసిన సమన్లను పాటించడానికి ఇరువురు నిరాకరించారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను విచారణకు పిలవగా.. ఆయన వెళ్లకపోవడంతో ఈడీ ఆయన సన్నిహితుల నివాసాలపై దాడులు చేస్తోంది.
ఢిల్లీ: కేసుల విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్(CM Kejriwal) కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemanth Sorean)కు ఈడీ జారీ చేసిన సమన్లను పాటించడానికి ఇరువురు నిరాకరించారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను విచారణకు పిలవగా.. ఆయన వెళ్లకపోవడంతో ఈడీ ఆయన సన్నిహితుల నివాసాలపై దాడులు చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మూడోసారి జారీ చేసిన సమన్లను సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ దాటవేశారు.
దీంతో దర్యాప్తు సంస్థ తదుపరి అడుగులు ఏంటని ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్లు ఇవ్వడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఆయన ఈడీ విచారణకు సహకరించేందుకు రెడీగా ఉన్నారని.. అయితే నోటీస్ చట్ట విరుద్ధంగా ఉందని పేర్కొంటూ విచారణకు హాజరుకావట్లేదని అంటోంది. నవంబర్ 2, డిసెంబర్ 18న ఈడీ నోటీసులు పంపింది.
2021-22 ఏడాదిలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ పాలసీ కొంతమంది మద్యం డీలర్‌లకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిని ఆప్ తీవ్రంగా ఖండించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక అందుకున్న తర్వాత పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.ఈ కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను 2023 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈడీ ఏం చేస్తుంది?
ఒక వ్యక్తి మూడు సార్లు ED సమన్లను విస్మరించవచ్చు. కేజ్రీవాల్ కి సమన్ల లిమిట్ పూర్తయినందునా ఈడీ ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ కోరి.. కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ పాటించడంలో విఫలమైతే అరెస్టు చేసి తదుపరి కోర్టు విచారణకు పంపవచ్చు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 03 , 2024 | 12:40 PM