ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సూసైడ్‌ డ్రోన్‌ను పరీక్షించిన కిమ్‌

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:47 AM

ఉత్తర కొరియా శనివారం శక్తిమంతమైన ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సోమవారం వెల్లడించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఉత్తర కొరియా శనివారం శక్తిమంతమైన ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సోమవారం వెల్లడించింది. పరీక్షల్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన కే-2 యుద్ధ ట్యాంకును పోలి ఉన్న ఓ వాహనాన్ని ఈ డ్రోన్‌తో పేల్చివేశారు.

దీన్ని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంగా పర్యవేక్షించారు. తమ యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ సూసైడ్‌ డ్రోన్లు దోహదపడతాయని, వీటి తయారీని వేగవంతం చేస్తామని కిమ్‌ చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ కిమ్‌ ఈ సూసైడ్‌ డ్రోన్‌ను పరీక్షించడం విశేషం.

Updated Date - Aug 27 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<