Delhi : 2020లో భారత్‌లో కొవిడ్ కల్లోలం!
ABN, Publish Date - Jul 21 , 2024 | 05:08 AM
కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది.
అదనంగా 11.9 లక్షలమంది మృతి
అంతర్జాతీయ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 20: కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది. ఆ ఏడాది దేశంలో అధికారిక కొవిడ్ మరణాల సంఖ్య కంటే 8 రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా కంటే 1.5 రెట్లు ఈ సంఖ్య ఎక్కువని పేర్కొంది.
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో పాటు పలు యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డేటాను విశ్లేషించి పరిశోధకులు నివేదిక రూపొందించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని కొట్టి పారేసింది. లోపభూయిష్టమైన పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేమంది. దేశంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ విశ్వసనీయమైనదని, దీనిప్రకారం 2019లో కంటే 2020లో 4,74,000 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది.
Updated Date - Jul 21 , 2024 | 05:08 AM