ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi excise policy case: సీఎంకు తప్పని కష్టాలు... మళ్లీ ఈడీ సమన్లు

ABN, Publish Date - Jan 31 , 2024 | 04:03 PM

సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌‌కు కష్టాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి 2న తమ విచారణ మందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు మరోమారు సమన్లు పంపింది.

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు కష్టాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి 2న తమ విచారణ మందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు మరోమారు సమన్లు పంపింది. ఈ కేసులో ఆయనకు ఈడీ సమన్లు పంపడం ఇది నాలుగోసారి.


దీనికి ముందు జనవరి 18న తమ ముందు హాజరుకావాలంటూ జనవరి 13న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. అయితే, ఈ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని భావిస్తున్న కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండటంతో ఈడీ విచారణకు సమన్లు జారీ చేసిన సమాయాన్ని కూడా కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలన్నదే బీజేపీ ఉద్దేశమని, ఈ కేసులో సీఎం నిందితుడు కాదని ఈడీ లిఖితపూర్వకంగా పేర్కొన్నప్పుడు సమన్లు పంపడంలో ఉద్దేశం ఏమిటనే ఆప్ నేత ఒకరు నిలదీశారు. కేజ్రీవాల్‌ను సాక్షిగా తమ ముందుకు రప్పించాలని ఈడీ అనుకుంటోందా, అనుమానితుడిగా భావిస్తోందా అనే విషయంలో స్పష్టత లేదని ఆయన చెప్పారు. కాగా, గతంలోనూ కేజ్రీవాల్‌కు నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 13న ఈడీ సమన్లు పంపింది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సోసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Updated Date - Jan 31 , 2024 | 04:03 PM

Advertising
Advertising