ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coaching centres: కోచింగ్ సెంటర్లకు గైడ్‌లైన్స్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

ABN, Publish Date - Aug 12 , 2024 | 07:31 PM

దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు (Coaching centres) నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi High court) సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.


పిటిషనర్ కోరినట్టు ఆదేశాలివ్వడం తమ పరిధిలోకి రాదని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ''మీ విజ్ఞప్తిని పరిశీలించాం. అది మా పరిధిలోకి రాదు. విద్యావస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంటే అది కూడా మా పని కాదు. విద్యావ్యవస్థలో లోపం ఉంటే ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లినప్పుడు ఫలితం చవిచూస్తుంది. సిటీలోని విద్యా వ్యవస్థను మాత్రం మేము ఫార్ములేట్ చేయలేం' అని బెంచ్ స్పష్టం చేసింది.

Puja Khedkar: పూజా కేడ్కర్‌కు ఊరట.. తక్షణ కస్టడీ అవసరం లేదన్న హైకోర్టు


అక్రమంగా నడుస్తున్న, ప్రమాణాలు పాటించని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై ఇన్వెస్టిగేషన్‌ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కుటుంబ్ స్వచ్ఛంద సంస్థ తమ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. అయితే పిటిషన్‌ విచారణకు కోర్టు నిరాకరించడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు అనుమతించింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 07:31 PM

Advertising
Advertising
<