Fire Accident: నవజాత శిశువులు మృతి: ఆసుపత్రి ఓనర్ అరెస్ట్
ABN, Publish Date - May 26 , 2024 | 07:59 PM
తూర్పు ఢిల్లీ వివేక్ విహార్‌లో నవజాత శిశువు సంరక్షణ ఆసుపత్రిలో శనివారం అర్థరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు.
న్యూఢిల్లీ, మే 26: తూర్పు ఢిల్లీ వివేక్ విహార్‌లో నవజాత శిశువు సంరక్షణ ఆసుపత్రిలో శనివారం అర్థరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ఆసుపత్రి యజమాని డాక్టర్ నవీన్ కిచ్చిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Remal Cyclone: బంగ్లాదేశ్‌లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మరికొన్ని ఆసుపత్రులు నడుస్తున్నాయన్నారు అయితే ఈ కేసులో మరో డాక్టర్ ఆకాశ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ ఆకాశ్ విధుల్లో ఉండగానే ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!
అయితే అగ్ని ప్రమాదం సంభవించిన ఆసుపత్రిలో మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆగ్నిమాపక ఉన్నతాధికారులు వెల్లడించారు. మంటలార్పడానికి నీళ్లు కూడా లేవన్నారు.
Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?
అలాగే ఆసుపత్రిలో విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్నాయని తెలిపారు. మరోవైపు జాతీయ చిన్నారి హక్కుల రక్షణ కమిషన్ బృందం.. అగ్నిప్రమాదం జరిగిన ఆసుపత్రిని పరిశీలించిందని ఆ కమిషన్ చైర్ పర్సన్ ప్రియాంక తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!
అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆసుపత్రిలోని పలువురు నవజాత శిశువులను స్థానికులు ప్రాణాలకు తెగించి వెళ్లి రక్షించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించగానే ఆసుపత్రిలోని సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారని వారు ఆరోపించారు.
LokSabha Elections: ఓటర్లకు ప్రియాంక, రాహుల్ సూచన
అయితే ఈ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియరాలేదు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 26 , 2024 | 08:04 PM