Share News

Delhi Lieutenant Governor: వైద్యారోగ్య శాఖ మంత్రి ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు..!

ABN , Publish Date - May 29 , 2024 | 06:30 PM

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓఎస్డీ డాక్టర్ ఆర్ఎన్ దాస్‌పై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఎల్జీ వీకే సక్సెనా.. తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Delhi Lieutenant Governor: వైద్యారోగ్య శాఖ మంత్రి ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు..!
Delhi Health Minister Saurabh Bharadwaj

న్యూఢిల్లీ, మే 29: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓఎస్డీ డాక్టర్ ఆర్ఎన్ దాస్‌పై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఎల్జీ వీకే సక్సెనా.. తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. దేశ రాజధానిలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడంలో డాక్టర్ డీఎన్ దాస్ పాత్ర కీలకమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!


అయితే శనివారం స్థానిక వివేక్ విహార్‌లోని న్యూ బార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించగా... పలువురు శిశువులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక 2021 కోవిడ్ సమయంలో వైద్య పరికరాలు కోనుగోలులో దాదాపు రూ. 60 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: మంచినీటిని వృధా చేస్తే.. రూ. 2 వేలు ఫైన్


అందులోభాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌‌లో డాక్టర్ దాస్‌కు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వేళ తాజాగా డాక్టర్ ఆర్ఎన్ దాస్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన వివేక్ విహార్‌లోని న్యూ బార్న్ బేబి కేర్‌ ఆసుపత్రికి అనుమతులు ఇప్పించడంలో ఓఎస్డీ డాకర్ట్ దాస్ ముఖ్య పాత్ర పోషించారంటూ బీజేపీ ఇప్పటికే ఆరోపణలు సంధించిన విషయం విధితమే.

Also Read: కరణ్ కాన్వాయి ఢీకొని ఇద్దరు మృతి

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 06:49 PM