ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఆయనకి బెయిల్ మంజూరు

ABN, Publish Date - Apr 02 , 2024 | 02:45 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో గతేడాది అరెస్టయిన ఆప్(AAP) నేతకు బెయిల్ మంజూరైంది. దీంతో ఈ కేసులో బెయిల్ పొందిన తొలి నేతగా ఆయన నిలిచారు.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో గతేడాది అరెస్టయిన ఆప్(AAP) నేతకు బెయిల్ మంజూరైంది. దీంతో ఈ కేసులో బెయిల్ పొందిన తొలి నేతగా ఆయన నిలిచారు. వివరాలు.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ను ఇన్నాళ్లు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను(ED) సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ముందు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదించారు. ట్రయల్ కోర్టు నిర్ణయించిన షరతులపై సంజయ్ సింగ్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఆయన వద్ద ఎలాంటి నగదు లభించనప్పటికీ ఆరు నెలలుగా జైళ్లో ఎలా ఉంచుతారని కోర్టు.. ఈడీని ప్రశ్నించింది.


మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి.. బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సింగ్‌ను గతేడాది అక్టోబర్ 4న ఈడీ అరెస్ట్ చేసింది. సింగ్ మూడు నెలలకు పైగా కస్టడీలో ఉన్నందున, నేరంలో తన పాత్ర లేదని చెబుతూ ఆయన బెయిల్ కోరారు.

Meta: వాట్సప్ సంచలనం.. ఏకంగా 76 లక్షల అకౌంట్ల తొలగింపు.. ఎందుకంటే

ఈడీ.. సంజయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించింది. 2021-22 ఢిల్లీ మద్యం కుంభకోణంలో వివిధ దశల్లో సింగ్ ప్రమేయం ఉందని పేర్కొంది. ఆప్ నేత మద్యం పాలసీ ద్వారా వచ్చిన అక్రమంగా డబ్బు పొందారని, ఇతరులతో కలిసి కుట్రలో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. విచారించిన కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 04:55 PM

Advertising
Advertising