గంజాయిలోని రసాయనంతో వృద్ధాప్యం వెనక్కి!
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:30 AM
గంజాయి వ్యసనం ఆరోగ్యానికి ప్రమాదకరం! కానీ, అదే గంజాయిలోని టెట్రాహైడ్రోక్యానబినోల్ (టీహెచ్‌సీ) అనే రసాయనాన్ని అతి తక్కువ మోతాదులో దీర్ఘకాలంపాటు వైద్యుల పర్యవేక్షణలో ఔషధంలా వాడితే..
జర్మనీ, ఇజ్రాయెల్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 26: గంజాయి వ్యసనం ఆరోగ్యానికి ప్రమాదకరం! కానీ, అదే గంజాయిలోని టెట్రాహైడ్రోక్యానబినోల్ (టీహెచ్‌సీ) అనే రసాయనాన్ని అతి తక్కువ మోతాదులో దీర్ఘకాలంపాటు వైద్యుల పర్యవేక్షణలో ఔషధంలా వాడితే..
అది వృద్ధాప్యం వల్ల మెదడులో వచ్చే మార్పులను రివర్స్ చేస్తుందని, వయసు మీరే ప్రక్రియను ఆలస్యం చేస్తుందని (యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాన్, యూనివర్సిటీ హాస్పిటల్ బాన్, ఇజ్రాయెల్‌కు చెందిన హిబ్రూ వర్సిటీ పరిశోధకులు..
ఎలుకల మెదళ్లపై ఈ అధ్యయనం చేశారు. వృద్ధాప్యం వల్ల ఆ ఎలుకల మెదళ్లలో వచ్చే సాధారణ సమస్యలను టీహెచ్‌సీ నయం చేయగలిగినట్టు వారు గుర్తించారు.
సాధారణంగా మనుషుల్లో వయసు పెరిగే కొద్దీ మతిమరపు, మెదడు చురుగ్గా పనిచేయకపోవడంవంటి సమస్యలువస్తుంటాయి.
ఆ సమస్యలకు చెక్‌పెట్టే ఔషధాల రూపకల్పనకు ఈ అధ్యయన ఫలితాలు దోహదం చేస్తాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు.
Updated Date - Aug 27 , 2024 | 04:31 AM