DMRC: మెట్రోను ఆశ్రయించిన ప్రయాణికులు.. ఒక్క రోజులో 69 లక్షల మంది..
ABN, Publish Date - Jun 29 , 2024 | 08:07 PM
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ మహానగరగం అతలాకుతలమవుంది. ఆ క్రమంలో ఎక్కడి వర్షపు నీరు అక్కడ నిలిచిపోయింది.
న్యూఢిల్లీ, జూన్ 29: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ మహానగరగం అతలాకుతలమవుంది. ఆ క్రమంలో ఎక్కడి వర్షపు నీరు అక్కడ నిలిచిపోయింది. దీంతో దేశ రాజధానిలో రహదారులు పిల్ల కాలువలను తలపించాయి. దాంతో కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు.. తమ వాహనాలను బయటకు తీస్తే.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయనేది వారి బాగా అర్థమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు మెట్రో రైలును ఆశ్రయించారు.
Also Read: Hemant Soren: బీజేపీకి సమయం ఆసన్నమైంది
Also Read: Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్
శుక్రవారం (జూన్ 28) ఒక్క రోజే.. 69 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) శనివారం ప్రకటించింది. రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించారని వెల్లడించింది. అయితే అంతుకు ముందు రోజు.. అంటే గురువారం (జూన్ 27) 62 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణించారని పేర్కొంది. ఇంకా గణాంకాలతో సహా వివరించాలంటే.. జూన్ 27వ తేదీ 62,58,072 మంది ప్రయాణికులు ప్రయాణించారని పేర్కొంది. ఇక జూన్ 28వ తేదీన 69,36,425 మంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని డీఎంఆర్‌సీ విశదీకరించింది.
Also Read: Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన
Also Read: Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు
Also Read: Gujarat: రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ వద్ద కూలిన షెల్టర్
అంటే శుక్రవారం ఒక్క రోజే.. 7 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో అదనంగా ప్రయాణించారని తెలిపింది. అయితే ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసిందని.. మెట్రో రైలు సేవలకు మాత్రం ఎక్కడ ఎటువంటి అంతరాయం కలగలేదని చెప్పింది. ఇంకోవైపు భారీ వర్షాలలో సైతం ఢిల్లీ ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా.. మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం పట్ల డీఎంఆర్‌సీ సంతోషం వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం 2.30 నుంచి 5.30 మధ్య 153.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా ఏళ్ల తర్వాత.. ఈ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: Viral Video: గోదావరిలో దూకిన మహిళ..సోషల్ మీడియాలో వైరల్
Also Read: Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
Also Read: Adilabad:మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
Latest Telugu News And National News
Updated Date - Jun 29 , 2024 | 08:08 PM