ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Water Crisis: 'నీటి సంక్షోభం'పై కేంద్ర మంత్రికి అతిషి లేఖ..

ABN, Publish Date - May 31 , 2024 | 03:54 PM

దేశ రాజధాని 'నీటి సంక్షోభం'తో అల్లాడుతోంది. తక్షణం ఆదుకోవాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి శుక్రవారంనాడు ఆమె లేఖ రాశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని 'నీటి సంక్షోభం' (Water Crisis)తో అల్లాడుతోంది. తక్షణం ఆదుకోవాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat)ను ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి (Atishi) కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి శుక్రవారంనాడు ఆమె లేఖ రాశారు.


''రోజవారీ నీటి అవసరాల కోసం యమునా నదీ జలాలపై ఢిల్లీ ఎక్కువగా ఆధారపడుతుందనే విషయం మీకు తెలుసు. అయితే అవసరమైన నదీ జలాలను హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి వదలకపోవడం వల్ల గత కొద్దిరోజులుగా వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఫలితంగా దేశరాజధానిలో నీటి కొరత తీవ్రమైంది. అదీగాక, ఢిల్లీలో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి అవసరం మరింత తీవ్రమైంది. ఇప్పటికే ఢిల్లీలో పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్‌ డిమాండ్-సప్లయ్ ఇబ్బందులో పడగా తాజా పరిస్థితి మరిత అదనపు భారంగా మారింది'' అని అతిష్ ఆ లేఖలో వాపోయారు.

Delhi Water Crisis: నీళ్లివ్వండి మహాప్రభో.. సుప్రీం తలుపుతట్టిన ఢిల్లీ సర్కార్.. తీవ్ర దుర్భిక్షానికి కారణాలేంటి?


హర్యానా ప్రభుత్వం తగినంత జలాలను విడుదల చేయకుంటే ఢిల్లీలోని ప్లాంట్లులు కూడా గరిష్ట స్థాయిలో పనిచేయడం సాధ్యం కాదని అతిషి వివరించారు. సమస్యను వివరిస్తూ హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనికి ఇప్పటికే లేఖ రాశానని, అయితే సీఎం కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని ఆమె కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. నీటిని వృథా చేస్తున్న వారిపై చర్యల కోసం ఇప్పటికే ఆన్-గ్రౌండ్స్ టీమ్‌లను రంగంలోకి దింపినట్టు చెప్పారు. హర్యానా, యూపీ, మరే ఇతర రాష్ట్రం నుంచైనా జలాలను రాష్ట్రానికి రప్పిస్తే ఢిల్లీ ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా రావాల్సిన జలాలను హర్యానా ప్రభుత్వం తక్షణం విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలని, 674.5 అడుగుల సాధారణ స్థాయికి యమునా జలాలు చేరుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని షెకావత్‌ను అతిషి కోరారు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 03:54 PM

Advertising
Advertising