Dengue: నగరంలో విజృంభిస్తున్న ‘డెంగ్యూ’..
ABN, Publish Date - Oct 04 , 2024 | 01:41 PM
నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు(Dengue and Chicken Gunya fevers) వ్యాపిస్తున్నాయి.
చెన్నై: నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు(Dengue and Chicken Gunya fevers) వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ రోజూ ఐదువేలమందికిపైగా నగరవాసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మొదట తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న వీరిని మూడు రోజులపాటు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించినమీదట జ్వరం తగ్గకపోతే వైద్యపరీక్షలు చేస్తున్నారు. అందులోనే డెంగ్యూ లేదా చికెన్ గున్యా జ్వరం వచ్చినట్లు నిర్ధారణ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Liquor stores: మద్యం దుకాణాల తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు..
చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలకు యాంటీ బయాటిక్ మందులు లేవు. అందువల్ల కాంప్లిమెంటరీ మందులు మాత్రమే ఇస్తున్నారు. జ్వరం నయమైన తర్వాత కూడా వంటి నొప్పులతో బాధపడుతున్నారు. చికెన్‌గున్యాతో బాధపడుతున్న సెల్వం అనే రోగి మాట్లాడుతూ జ్వరంతో వరుసగా నాలుగైదు రోజులపాటు అవస్థలు పడ్డానని, ఆ తర్వాత జ్వరం తగ్గినా వంటి నొప్పులు పోలేదని చెప్పారు. ఈ విషయమై వైద్యనిపుణులు మాట్లాడుతూ తేలికపాటి జ్వరం, జలుబు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఒకటి రెండు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే చాలని చెబుతున్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నవారు, ప్రత్యేకించి వృద్ధులు, చిన్న పిల్లలు వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు.
బీపీ, శ్వాస, మూత్రాశయ సమస్యలు, మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ జ్వరాల బారినపడితే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని హెచ్చరించారు. జ్వరంతో బాధపడుతున్నవారితో ఇతరులు దూరంగా ఉండాలన్నారు. పండ్లు, కాయగూరలు వంటి పుష్టికరమైన ఆహారం భుజించాలన్నారు. ఈ జ్వరాలతో బాధపడుతున్నవారు మందులు వాడాల్సిన అవసరం లేదని, వేటినీటి ఆవిరి పడితే చాలని సిద్ధవైద్యులు చెబుతున్నారు. ఇంటిపట్టునే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదన్నారు. తులసి ఆకులు, కర్పూరవళ్లి ఆకులు తింటే శ్రేష్టమని అన్నారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇవి సీజన్ జ్వరాలని వీటిని నయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులున్నాయని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి నగరవాసులకు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నామని చెప్పారు.
................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..........................................................
Minister: ‘ముడా’ వివాదంపై పెదవి విప్పిన మంత్రి.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
- నాకు నోటీసులు రాలేదు..
- ముడా వివాదంపై మంత్రి బైరతి సురేశ్
బెంగళూరు: ముడా ఇంటిస్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఆప్తుడు, నగరాభివృద్ధి శాఖమంత్రి బైరతి సురేశ్(Minister Bairati Suresh)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు వచ్చిన కథనాలపై స్పందించారు. మంత్రి సురేశ్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి పలు చానళ్ళు, సోషల్‌మీడియాలో ఈడీ నుంచి నోటీసులు వచ్చాయనే ప్రచారం సాగుతోందన్నారు. అయితే ముడా వివాదానికి సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. తన కార్యాలయం, తన ఇంటికి ఈడీ అధికారులు ఎవరూ రాలేదన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు నోటీసులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తనను రాజకీయంగా అవమానం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. చట్టపరంగా శాఖను నిర్వహిస్తున్నానని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదని, వారికి మంచి జరగాలన్నారు. అందుకు మంత్రి వివరణ ఇచ్చారు.
ఇదికూడా చదవండి: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం
ఇదికూడా చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. ప్రభాస్, రామ్ చరణ్, రాజమౌళి ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !
ఇదికూడా చదవండి: Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 04 , 2024 | 01:41 PM