ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress MP: డైలమాలో రాహుల్

ABN, Publish Date - Jun 12 , 2024 | 06:26 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డైలమాలో పడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ గెలుపొందారు.

తిరువనంతపురం, జూన్ 12: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డైలమాలో పడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఆయన గెలుపొందారు. ఈ నేపథ్యంలో బుధవారం కేరళలోని మలప్పురంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. తనను వరుసగా రెండోసారి ఎంపీగా గెలిపించినందుకు వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్జతలు తెలిపారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి తాను రాజీనామా చేయవలసి ఉందన్నారు. కానీ తాను ఈ రెండు నియోజకవర్గాల్లో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో దేనికి రాజీనామా చేయాలో తెలియన ఓ విధమైన డైలమాలో తాను ఉన్నట్లు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అయితే తాను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాననేది త్వరలో మీరు చూడబోతున్నారని వాయనాడ్ ప్రజలకు రాహుల్ తెలిపారు. వయనాడ్ ఎంపీగా ఇటీవల విజయం సాధించిన అనంతరం రాహుల్ తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేశారు.


మరోవైపు ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యంగ్య బాణాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. పరమాత్ముని దయతో పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలకు అనుకూలంగా పని చేస్తారన్నారు. కానీ తాను సామాన్య మానవుడునని చెప్పారు. దీంతో చాలా సాధారణంగా ఉంటానని చెప్పారు. దేశంలోని పేదవారే తనకు దేవుళ్లన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రధాని మోదీ దృక్పథంలో మార్పు వచ్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.


ఇంకోవైపు ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానానికి రాజీనామా చేయనున్నట్లు.. పార్టీ పెద్దలకు రాహుల్ ఓ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో పార్టీ పెద్దలు రాహుల్ నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తుంది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 06:26 PM

Advertising
Advertising