ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali: దీపావళికి 14వేల బస్సులు..

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:51 AM

దీపావళి(Diwali) పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 14,086 బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Sivashankar) తెలిపారు. సోమవారం సచివాలయంలో దీపావళికి ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రవాణా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- రవాణా మంత్రి శివశంకర్‌

చెన్నై: దీపావళి(Diwali) పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 14,086 బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Sivashankar) తెలిపారు. సోమవారం సచివాలయంలో దీపావళికి ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రవాణా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి శివశంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా ఈ నెల 28 నుంచి 30 వరకు చెన్నై నుంచి రోజూ నడిపే 2092 బస్సులతోపాటు అదనంగా 4900 ప్రత్యేక బస్సులు కలుపుకుని మూడు రోజులూ 11,176 బస్సులను నడుపుతామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.55లక్షలతో క్లాక్‌ టవర్‌ నిర్మాణం..


ఇతర నగరాల నుంచి కూడా ఆ మూడు రోజులూ 2901 ప్రత్యేక బస్సుల చొప్పున మొత్తం 14,086 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ ముగిసిన తర్వాత స్వస్థలాల నుంచి చెన్నైకి తిరిగివచ్చేవారి కోసం నవంబర్‌ 2 నుంచి 4 వరకు రోజూ నడిపే 2092 బస్సులతోపాటు 3165 ప్రత్యేక బస్సులు చొప్పున మూడు రోజులపాటు మొత్తం 9441 బస్సులు, ప్రముఖ నగరాల నుంచి ఇతర నగరాల వైపు 3165 బస్సులు చొప్పున మొత్తం 12,606 బస్సులు నడుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


కీలంబాక్కం నుంచి...

ఇక నగరంలోని మూడు బస్‌స్టేషన్ల నుంచి ఏయే నగరాలకు బస్సులు నడుపుతామనే వివరాలను కూడా ఆయన వెల్లడించారు. కీలంబాక్కంలోని కలైంజర్‌ శతజయంతి స్మారక బస్‌ స్టేషన్‌ నుంచి పుదుచ్చేరి, చిదంబరం, తిరుచ్చి, మదురై, తూత్తుకుడి, సెంగోట, తిరునల్వేలి, సేలం, కోయంబత్తూరు, వందవాసి, పోలూరు, తిరువణ్ణామలై, కుంభకోణం, తంజావూరు నగరాలకు బస్సులు నడుపుతారు.

కోయంబేడు నుంచి...

కోయంబేడు బస్‌స్టేషన్‌ నుంచి ఈసీఆర్‌, కాంచీపురం, బెంగళూరు, తిరుత్తణి, హోసూరు తదితర నగరాలకు బస్సులు నడుపుతారు.


మాధవరం నుంచి..

మాధవరం బస్‌స్టేషన్‌ నుంచి పొన్నేరి, ఊత్తుకోట మీదు ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలకు వెళ్లే బస్సులతోపాటు, తిరుచ్చి, సేలం, కుంభకోణం, తిరువణ్ణామలై బస్సులు కూడా నడుపనున్నారు. ప్రత్యేక బస్సులలో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవడానికి వీలుగా కీలంబాక్కం బస్‌స్టేషన్‌లో 7 రిజర్వేషన్‌ కౌంటర్లు, కోయంబేడు బస్‌స్టేషన్‌ 2 రిజర్వేషన్‌ కౌంటర్లు పనిచేయనున్నాయి. ఇదే విధంగా tnstc official app www.tnstc.in నుంచీ టికెట్లను రిజర్వు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.


కంట్రోల్‌ రూమ్‌..

ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల వివరాలు తెలుసుకునేందుకు, ఆ బస్సులకు సంబంధించి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బస్సు సర్వీసులకు సంబంధించిన సమస్యలపై నెం.9445014436 ద్వారా కంట్రోల్‌ రూం అధికారులతో సంప్రదించవచ్చని తెలిపారు. ఇదే విధంగా టోల్‌ ఫ్రీ నెం. 18004256151కు, నెం.044-24749002, 044-26280445, 044-26281611 లనుంచి ఫోన్‌ చేసి ఫిర్యాదులు తెలుపవచ్చన్నారు. అనంతరం చెన్నై సచివాలయంలో మహానగర రవాణా సంస్థ మాజీ ఉద్యోగుల వారసులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగ నియామక పత్రాలను లబ్ధిదారులకు మంత్రి శివశంకర్‌ అందజేశారు.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

......................................................................

Gautami: నటి గౌతమికి అన్నాడీఎంకే ప్రచార పదవి

చెన్నై: బీజేపీ నుంచి వైదొలిగి అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami)కి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శిగా నియమించారు. పార్టీ మైనార్టీ విభాగం ఉప కార్యదర్శిగా ఫాతిమా అలీ, వ్యవసాయ విభాగం ఉప కార్యదర్శిగా సన్యాసి నియమితులయ్యారు. కాగా, అన్నాడీఎంకే(AIADMK)లో అతి కీలకమైన పదవిగా భావిస్తున్న ప్రచార విభాగానికి సుదీర్ఘ అనుభవం ఉన్న వారికి మాత్రమే కేటాయించడం ఆనవాయితీ. ఆ రీతిలో ప్రచార డిప్యూటీ సెక్రటరీ పదవి నటి గౌతమిని వరించింది.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 11:51 AM