Annamalai: ఈ పార్టీలు ఓట్ల కోసం వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశాయి
ABN, Publish Date - Apr 19 , 2024 | 10:37 AM
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, కోయంబత్తూరు అభ్యర్థి కె. అన్నామలై లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోయంబత్తూరులో డీఎంకే, ఏఐఏడీఎంకే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో అన్నామలై ఓటు వేశారు.
తమిళనాడు(tamilnadu) బీజేపీ అధ్యక్షులు, కోయంబత్తూరు అభ్యర్థి(BJP Coimbatore candidate) కే అన్నామలై(Annamalai) లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ క్రమంలో ఓటు వేసిన అనంతరం మాట్లాడిన ఆయన కోయంబత్తూరులో డీఎంకె, ఎఐఎడీఎంకేలు రూ. 1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రలోబాలకు గురిచేశారని వ్యాఖ్యానించారు. కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో అన్నామలై ఓటు వేశారు. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
కోయంబత్తూరు(Coimbatore)లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే నేత గణపతి పీ రాజ్‌కుమార్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)కి చెందిన సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. అంతేకాదు బీజేపీకి చెందిన ఎవరైనా తనను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఒకరినైనా తీసుకురాగలిగితే, తాను అదే రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నామలై ఉద్ఘాటించారు.
డబ్బులతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని డీఎంకే(DMK) భావిస్తోందని, ఏఐఏడీఎంకే(AIADMK) కూడా అదే బాటలో ఉందన్నారు. కోయంబత్తూరులో అధికారులు గత 2-3 రోజులుగా అంధులుగా మారారని వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజలు కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. అయినప్పటికీ తమిళనాడులో బీజేపీ సొంతంగా 25 శాతం మార్కును దాటుతుందని, విజయ సంఖ్య రెండంకెల్లో ఉంటుందని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. దీంతోపాటు ఈరోజు నేను నా ఓటు వేసి ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఇది మన దేశంలోని ప్రతి పౌరునికి ముఖ్యమైన కర్తవ్యమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
ఇది కూడా చూడండి:
Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 19 , 2024 | 10:42 AM