ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Tamilisai: పాలన చేతగాకే సైకిల్‌ తొక్కుతున్నారు..

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:27 PM

పాలన చేతగాకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పార్టీని నడపలేక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైకిల్‌ తొక్కుతున్నారని తెలంగాణ మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) వ్యంగ్యాస్త్రం సంధించారు.

- తమిళిసై విసుర్లు

చెన్నై: పాలన చేతగాకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పార్టీని నడపలేక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైకిల్‌ తొక్కుతున్నారని తెలంగాణ మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీవో చిదంబరనార్‌ 153వ జయంతిని పురస్కరించుకుని హార్బర్‌ నియోజకవర్గంలో ఉన్న ఆయన విగ్రహానికి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తమిళుల గురించి రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో చేర్చాలని కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: ఇండియా కూటమిలోనే డీఎంకే..


తిరుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను గౌరవించడాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ టీచర్లకు వేతనం ఇవ్వలేమని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.210 కోట్ల విద్యుత్‌ చార్జీలు చెల్లించలేకపోతున్నారని, ఇలాంటి వారు విద్యార్థులకు ఎలా చదువు చెబుతున్నారో తెలియడం లేదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైకిల్‌ తొక్కడంపై స్పందిస్తూ, పాలన చేతకాగ స్టాలిన్‌, పార్టీని నడపలేక రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) సైకిళ్ళు తొక్కుతున్నారంటూ ఎద్దేవా చేశారు.


...................................................

ఈ వార్తను కూడా చదవండి:

...................................................

Chennai: ఊటీలో రెండో సీజన్‌ ప్రారంభం..

- అందుబాటులోకి ప్రత్యేక కొండ రైలు సేవలు

చెన్నై: నీలగిరి జిల్లా ఊటీ(Ooty)లో రెండో సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 7, 8, 14, 15వ తేదీల్లో ప్రత్యేక కొండ రైలు(Hill train) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఊటీలోని ఆహ్లాదరకమైన వాతావారణాన్ని ఆస్వాదించేందుకు సీజన్‌ రోజుల్లో వివిధ ప్రాంతాకు చెందిన పర్యాటకులు వెళ్తుంటారు. ప్రస్తుతం రెండో సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో పండుగలు, వారాంతపు సెలవు రోజుల్లో కున్నూరు - ఊటీ(Coonoor - Ooty) మధ్య ప్రత్యేక కొండ రైలు సేవలు ఈ నెల 7, 8 తేదీల్లో అదేవిధంగా కున్నూరు - ఊటీ మధ్య 14, 15వ తేదీల్లో అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు దక్షిణ రైల్వే(Southern Railway) అధికారులు తెలిపారు.


కున్నూరు నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరే రైలు 9.40 గంటలకు ఊటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఊటీ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి 5.55కు కున్నూరు చేరుకుంటుంది. ఊటీ - కెత్తి - ఊటీ మధ్య మూడు రౌండ్ల జాయ్‌ రైడ్‌ ప్రత్యేక రైలు సెలవు రోజుల్లో నడుపున్నారు. తొలి రౌండ్‌లో ఊటీ నుంచి 9.45 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు కెతి చేరుకుంటుంది. మరుమార్గంలో ఉదయం 10.10 గంటలకు బయలుదేరి 11.00 గంటలకు ఊటీ చేరుతుంది. రెండో రౌండ్‌లో 11.30 గంటలకు ఊటీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10కి కెత్తి చేరుకుని, అక్కడి నుంచి 12.40కు బయలుదేరి 1.10 గంటలకు ఊటీ చేరుకుంటుంది. ఈ రైలులో ఫస్ట్‌క్లాస్ లో 80 సీట్లు, సెకండ్‌ క్లాస్‌లో 130 సీట్లుంటాయి. ఈ రైలుకు ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయం ఉందని దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2024 | 12:27 PM

Advertising
Advertising