ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!.. హైటెన్షన్ వాతావరణం

ABN, Publish Date - Mar 21 , 2024 | 07:20 PM

దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కాగా బలవంతపు అరెస్ట్ నుంచి తనకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్ట్ తోసిపుచ్చింది. కేజ్రీని అరెస్ట్ చేస్తామా లేదా లేదా చేయమా అనేది తాము చెప్పడంలేదని, విచారణకు సహకరించాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 22లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది. ఈడీ సమన్ల వెనుక గల కారణాలను కేజ్రీవాల్‌కి చెప్పలేకపోతే.. ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఉన్న ఆధారాలను తమకు చూపించాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుంచితే ఇటీవలే లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, కవిత వంటి ఎంతో మంది నేతలు ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 21 , 2024 | 07:28 PM

Advertising
Advertising