ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk - Donald Trump: ట్రంప్‌పై మస్క్ భారీ బెట్.. ప్రతి నెల రూ.365 కోట్ల ఆర్థిక సహాయం!

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:10 PM

ప్రపంచ కుభేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ట్రంప్‌నకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Elon Musk with Donald Trump

ప్రపంచ కుభేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US president Elections) పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు భారీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ట్రంప్‌నకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం భారీగా నిధులు (Elon Musk Donation) సమకూర్చేందుకు మస్క్ సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం ప్రతి నెల 45 మిలియన్ డాలర్లు (రూ.365 కోట్లు) సమకూర్చడానికి మస్క్ అంగీకరించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) ఓ కథనాన్ని ప్రచురించింది.


నిజానికి ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ లేదా డెమోక్రటిక్ పార్టీలకు తాను ఆర్థిక సహకారం చేయాలనుకోవడం లేదని మస్క్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకుని ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి పెద్ద మొత్తంలో విరాళం అందించారు. ఇటీవలి కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌నకు మస్క్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు పూర్తి స్థాయిలో విరాళాలు అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.


ట్రంప్ ఎన్నికల ఖర్చు కింద జులై నెల మొదలుకుని ప్రతి నెల 45 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు మస్క్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు దక్కే అతి పెద్ద విరాళం మస్క్ నుంచే కావడం విశేషం. మస్క్ మాత్రమే కాదు.. అతడి స్నేహితులు కూడా ట్రంప్ కోసం విరాళాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం


Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 01:10 PM

Advertising
Advertising
<