ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:53 PM

భారత్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్‌లో ఒక్క రోజులో ఎలా 640 మిలియన్ ఓట్లు లెక్కించారు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రశంసలు కురిపించారు. ‘భారత్‌లో ఒక్క రోజులో ఎలా 640 మిలియన్ ఓట్లు లెక్కించారు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. కాలిఫోర్నియాలో మాత్రం 18 రోజులుగా ఓట్ల లెక్కింపు సాగుతోందంటూ చురకలంటించారు. ఇదే వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తి పోస్టుపై స్పందించిన ఆయన విచారం వ్యక్తం చేశారు.

కాగా, మస్క్ పోస్టుపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. హ్యాకింగ్‌ సాధ్యం కాని ఈవీఎంలు, వోటర్ ఐడీలు, బయోమెట్రిక్ డిజిటల్ ఐడీలు వంటివన్నీ ఇండియా లాంటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమని అన్నారు.

Electoins: రెండు రోజులే గడువు.. లేదంటే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన


ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజేతగా నిలిచి వారాలు గడుస్తున్నా కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇంకా 3 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియాలో 39 మిలియన్ల మంది నివసిస్తున్నారు. నవంబర్ 5 జరిగిన ఎన్నికల్లో సుమారు 16 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆలస్యంగా ఫలితాలు ప్రకటించే రాష్ట్రంగా కాలిఫోర్నియాకు ఎప్పటి నుంచో పేరుంది.

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..


జనాభా అధికంగా ఉండటంతో, ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంలో తమ ఓటు వేయడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని స్థానిక మీడియాలో కథనాలు వెలువుడుతన్నాయి. స్థానిక అధికారుల ప్రకారం, 2020 ఎన్నికల్లో కూడా కాలిఫోర్నియా ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. మెయిల్ ఓటింగ్ విధానంలో బ్యాలెట్ పేపర్ల ధ్రువీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని, వ్యక్తిగతంగా వచ్చి ఓటేసి వెళ్లిన వారి బ్యాలెట్ల ధ్రువీకరణ కంటే దీనికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోందని చెప్పారు.

Read latest and National News

Updated Date - Nov 24 , 2024 | 09:59 PM