ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎగ్జిట్‌ పోల్స్‌ మళ్లీ ఫెయిల్‌!

ABN, Publish Date - Nov 24 , 2024 | 03:59 AM

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మళ్లీ తప్పాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ,

యాక్సిస్‌ మై ఇండియా అంచనాలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా

న్యూఢిల్లీ, నవంబరు 23: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మళ్లీ తప్పాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ, ఈ స్థాయిలో సీట్లు సాధిస్తుందని ఏ ఒక్క సంస్థ కూడా చెప్పలేకపోయింది. దాదాపు అన్ని సంస్థలు మహాయుతికి సగటున 155-190 మధ్యలో సీట్లు వస్తాయని ప్రకటించాయి. కానీ, వాస్తవ ఫలితాల్లో ఈ కూటమి ఏకంగా 233 సీట్లు సాధించింది. ఒక్క యాక్సిస్‌ మై ఇండియా సంస్థ మాత్రమే మహాయుతి కూటమికి గరిష్ఠంగా 200సీట్ల వరకు రావొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)కి సగటున 100-120 సీట్లు రావొచ్చని సర్వే సంస్థలు అంచనా వేయగా.. ఈ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితం అయింది. ఒక్క పోల్‌ డైరీ మాత్రమే ఈ కూటమికి కనిష్ఠంగా 69 సీట్లు రావొచ్చని పేర్కొంది.

యాక్సిస్‌ మై ఇండియా 82 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. ఇక, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమికి 50కి పైగా సీట్లు వస్తాయని ఒక్క యాక్సిస్‌ మై ఇండియా సంస్థ మాత్రమే అంచనా వేసింది. ఇది ఇండియా కూటమికి 53 సీట్లు వస్తాయని తెలిపింది. అసలు ఫలితాల్లో కూటమికి 57 స్థానాలు వచ్చాయి. ఎన్డీయే కూటమికి 25 స్థానాలు వస్తాయని వెల్లడించగా.. 23 స్థానాలు వచ్చాయి. మిగతా సంస్థల్లో కొన్ని హంగ్‌ వస్తుందని అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు బీజేపీదే అధికారం అని తేల్చి చెప్పాయి.

కానీ, ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాగా. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పినప్పుడు యాక్సిస్‌ మై ఇండియా సీఈవో ప్రదీప్‌ గుప్తా టీవీ కార్యక్రమం లైవ్‌లోనే కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆ ఒక్క సంస్థ మాత్రమే రెండు రాష్ట్రాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా అంచనాలను వెల్లడించింది.

Updated Date - Nov 24 , 2024 | 03:59 AM