Jai Shankar: కచ్చతీవు రగడ.. జై శంకర్ స్పందన ఇదే..
ABN, Publish Date - Apr 01 , 2024 | 11:50 AM
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు సరిహద్దులు దాటుుతన్నాయి. పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు సరిహద్దులు దాటుుతన్నాయి. పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ( Congress ) పార్టీ శ్రీలంకకు ఈ ద్వీపాన్ని ధారాదత్తం చేసిందని మోదీ ఆరోపించారు. గత పాలకుల వైఫల్యమే నేటి పరిస్థితికి కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడు తమిళనాడు జాలర్లు తమ రాష్ట్రానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దీవి వద్ద చేపల వేటకు వెళ్లి శ్రీలంక నేవీ చేతిలో అరెస్టవుతున్నారని బీజేపీ ఆక్షేపించింది.
తాజాగా కచ్చతీవు వ్యవహారంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదని చెప్పారు. పార్లమెంట్‌లో కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు ఇండియా వద్దే ఉందని కానీ కాంగ్రెస్ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసిందని వ్యాఖ్యానించారు.
Elections 2024: మీ దారి మీది.. నా దారి నాది.. పార్టీకి ఉపాధ్యక్షుడు రాజీనామా..
కచ్చతీవు దీవిని పొరుగు దేశానికి అప్పగిస్తూ 1974 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో దశాబ్దాల క్రితం శ్రీలంకకు అప్పగిస్తే ఆ దీవులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు. ఎన్నికల ముందు సున్నితమైన అంశాలను లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 11:50 AM