ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trending News: భగ్గుమంటున్న వెల్లుల్లి ధర.. రైతులు చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - Feb 17 , 2024 | 03:57 PM

మొన్నామధ్య టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులు అల్లాడిపోయారు. దాదాపు రెండు నెలల వరకు కిలో టమాటాల ధర రూ.200కు పైగా పలికింది. ఇదే తరుణంలో టమాటా దొంగతనాలు ఎక్కువయ్యాయి.

మొన్నామధ్య టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులు అల్లాడిపోయారు. దాదాపు రెండు నెలల వరకు కిలో టమాటాల ధర రూ.200కు పైగా పలికింది. ఇదే తరుణంలో టమాటా దొంగతనాలు ఎక్కువయ్యాయి. దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు టమాటా సాగు చేసిన రైతులు పొలాల వద్దే పడిగాపులు కాశారు. ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో ధర రూ.500కు పైగా పలుకుతోంది. సాధారణంగా ఇళ్లు, ఆఫీసులు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ఓ రైతు తన పొలంలో సీసీ కెమెరాను అమర్చాడు. సౌరశక్తితో పనిచేసే ఈ కెమెరాలు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అలారం మోగిస్తాయి.

వెల్లుల్లి ధర రాకెట్ వేగంతో పెరుగుతోంది. కిలో రూ.500 దాటింది. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడ జిల్లా మొహ్‌ఖేద్ ప్రాంతంలోని గ్రామాల్లోని రైతులు వెల్లుల్లి సాగు చేశారు. ప్రస్తుతం కోతల సమయం దగ్గర పడింది. మరోవైపు వెల్లుల్లి ధర అమాంతం పెరిగిపోతోంది. దీంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ధర పెరిగిందని ఆనందపడాలో, దొంగతనాలు జరుగుతున్నాయని బాధపడాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు అన్నదాతలు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా వారికి తళుక్కున ఓ ఉపాయం తట్టింది. ఆ ప్లాన్ ను యథాతథంగా ఫాలో అయ్యారు.


సౌర శక్తితో పని చేసే సీసీ కెమెరాలను బిగించుకున్నారు. ఏదైనా అనుమనాస్పదంగా కనిపిస్తే అలారం మోగించేలా ఏర్పాటు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి దొంగతనాలు తగ్గినట్లు రైతులు తెలిపారు. కాగా.. 2023లో వెల్లుల్లికి మంచి ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు వెల్లుల్లి సాగును వదులుకున్నారు. దీంతో ఈ ఏడాది వెల్లుల్లి ధర అమాంతంగా పెరిగిపోయింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 03:57 PM

Advertising
Advertising