ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీపీఎ్‌సను నమ్ముకుని ముగ్గురి మృత్యువాత!

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:16 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో జీపీఎస్‌ నావిగేషన్‌ సాయంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి పడి మృత్యువాత పడ్డారు.

బరేలీ(యూపీ), నవంబరు 24: ఉత్తర్‌ప్రదేశ్‌లో జీపీఎస్‌ నావిగేషన్‌ సాయంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి పడి మృత్యువాత పడ్డారు. బరేలీ, బూదాన్‌ జిల్లాల మధ్య శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు దాతాగంజ్‌ నుంచి ఫరీద్‌పూర్‌ ప్రయాణించేందుకు నావిగేషన్‌ మ్యాప్‌ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. వంతెన అసంపూర్తిగా ఉన్న విషయం తెలియకపోవడం, కారు వేగంగా ప్రయాణిస్తుండడంతో అదుపు కాక 25 అడుగుల ఎత్తు నుంచి రామ్‌గంగా నదిలో నీళ్లు లేని చోట గుంతలో పడిందని తెలిపారు. మృతులు మెయిన్‌పురికి చెందిన కౌశల్‌ కుమార్‌, ఫరూఖాబాద్‌కు చెందిన వివేక్‌ కుమార్‌, అమిత్‌ కుమార్‌లుగా గుర్తించారు. 2022లో వచ్చిన వరదలకు ఈ వంతెనలో సగభాగం కొట్టుకుపోయింది. ఈ విషయం జీపీఎ్‌సలో అప్‌డేట్‌ కాలేదు.

Updated Date - Nov 25 , 2024 | 03:16 AM