ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington: వెబ్‌ పేజీలను చదివి వినిపించేలా గూగుల్‌ క్రోమ్‌లో ఫీచర్‌..

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:17 AM

మీరు సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ బ్రౌజర్‌ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే.. ఇకపై ఎంచక్కా మీరు మీ మొబైల్‌లో వెబ్‌ పేజీలను ఆడియో రూపంలో వినొచ్చు. అంతేకాదు.. టేప్‌రికార్డర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌ మాదిరిగా.. రివైండ్‌, ఫార్వర్డ్‌, పాస్‌ వంటి ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.

వాషింగ్టన్‌, జూన్‌ 17: మీరు సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ బ్రౌజర్‌ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే.. ఇకపై ఎంచక్కా మీరు మీ మొబైల్‌లో వెబ్‌ పేజీలను ఆడియో రూపంలో వినొచ్చు. అంతేకాదు.. టేప్‌రికార్డర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌ మాదిరిగా.. రివైండ్‌, ఫార్వర్డ్‌, పాస్‌ వంటి ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు. ఈ మేరకు గూగుల్‌ తన క్రోమ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌-125లో ‘లిజన్‌ ద పేజ్‌’ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. బీటా వెర్షన్‌ యూజర్లకే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉండగా.. త్వరలో ఇతర వెర్షన్లకూ విస్తరించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.


ప్రస్తుతం 12 భాషల్లో-- ఆంగ్లం, హిందీ, బెంగాలీతోపాటు.. అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇండోనేసియన్‌, జపనీస్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పాని్‌షలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. మీరు మీ మొబైల్‌ ఫోన్‌ స్ర్కీన్‌ లాక్‌ చేసినా.. బ్రౌజర్లో మరో ట్యాబ్‌లో వేరే సైట్‌ను బ్రౌజ్‌ చేస్తున్నా.. వాయిస్‌ కొనసాగుతుంది. క్రోమ్‌ పేజీపైన కుడివైపు ఉండే ఆప్షన్‌ మెనూ(మూడు నిలువు చుక్కలు)ని క్లిక్‌ చేస్తే.. ‘లిజన్‌’ అనే ఆప్షన్‌ వస్తుంది.

Updated Date - Jun 18 , 2024 | 05:17 AM

Advertising
Advertising