National: విచారణకు హేమ డుమ్మా
ABN, Publish Date - May 28 , 2024 | 05:35 AM
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన సినీనటి హేమ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని పోలీసులకు సమాచారం
బెంగళూరు, మే 27(ఆంధ్రజ్యోతి): రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన సినీనటి హేమ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు ఆమె సందేశం పంపినట్టు తెలిసింది.
బెంగళూరులోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణైన విషయం తెలిసిందే. వీరందరికీ విచారణకు రావాలంటూ నోటీసులిచ్చినా ఒక్కరూ హాజరైన దాఖలాల్లేవు. దీంతో వారందరికీ రెండో నోటీసు జారీ చేసేందుకు సీసీబీ పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
Updated Date - May 28 , 2024 | 05:35 AM