ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Film director: సినీ దర్శకుడు అమీర్‌ను విచారించిన ఎన్‌సీబీ

ABN, Publish Date - Apr 03 , 2024 | 09:42 AM

రూ.2 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ దర్శకుడు అమీర్‌(Tamil film director Aamir) ఢిల్లీలోని ఎన్‌.సి.బి (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారుల ఎదుట హాజరయ్యారు.

చెన్నై: రూ.2 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ దర్శకుడు అమీర్‌(Tamil film director Aamir) ఢిల్లీలోని ఎన్‌.సి.బి (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు నగరానికి చెందిన మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్‌ సాధిక్‌(Film producer Zafar Sadhik)తో అమీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని అమీర్‌ను విచారించేందుకు నిర్ణయించిన ఎన్‌సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసి, 2వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో అమీర్‌ మంగళవారం ఢిల్లీలోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఎన్‌సీబీ అధికారుల బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ముఖ్యంగా జాఫర్‌ సాధిక్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసే అంశం? ఆయన ఎలా పరిచయమయ్యారు? కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాలు నిర్మించే స్థాయికి జాఫర్‌సాధిక్‌ ఎలా ఎదిగారు? ఆయన ఆదాయ వనరులు ఏమిటి? జాఫర్‌ ప్రారంభించిన రెస్టారెంట్‌ వ్యాపారంలో భాగస్వామిగా ఎలా చేరారు? తదితర అంశాలపై అమీర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలన్నింటికీ అమీర్‌ ఓపిగ్గా సమాధానం చెప్పినట్టు తెలిసింది.

ఇదికూడా చదవండి: Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి

Updated Date - Apr 03 , 2024 | 09:42 AM

Advertising
Advertising