ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Navy: జలాంతర్గామిని ఢీకొన్న చేపల వేట పడవ... 11 మంది సురక్షితం, ఇద్దరు గల్లంతు

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:31 PM

ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కోస్ట్‌గార్డులు తమ అధీనంలోకి తీసుకుని నౌకల మార్గాలను మళ్లించారు. జాడ గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు సామగ్రని రప్పించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆరు నౌకలు, నిఘా విమానాలు రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ: భారత సముద్రజలాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామిని గోవా తీరానికి 70 నాటకల్ మైళ్ల దూరంలో చేపలు పట్టే పడవ ఒకటి ఢీకొంది. దీంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పడవలోని 11 మందిని భారత నౌకదళం రక్షించింది. మరో ఇద్దరి ఆచూకి గల్లంతైంది. వీరి కోసం గాలిస్తు్న్నారు. సబ్‌మెరైన్-ఫిషింగ్ వెసెల్ ఢీకొనడానికి కారణాలు కానీ, జరిగిన నష్టంపై కానీ ఇండియన్ నేవీ ఎలాంటి వివరాలు వెల్లడించ లేదు.

Nijjar Killing: నిజ్జర్ హత్య కేసులో మీడియా కథనంపై కెనడా యూటర్న్


కాగా, ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కోస్ట్‌గార్డులు తమ అధీనంలోకి తీసుకుని నౌకల మార్గాలను మళ్లించారు. జాడ గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు సామగ్రని రప్పించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆరు నౌకలు, నిఘా విమానాలు రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన సబ్‌మెరైన్‌ను స్కార్ఫియన్ శ్రేణికి చెందిన అత్యాధునికి జలాంతర్గామిగా చెబుతున్నారు. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, గూఢచార సేకరణ సహా వివిధ రకాల ఆపరేషన్లు చేపట్టే సామర్థ్యం దీనికి ఉంది.


ఈ ఏడాది ఆగస్టులో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు తీరప్రాంతంలో శ్రీలంక నావీ వెసెల్‌ను చేపలు పట్టే పడవ ఢీకొంది. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడి జాడ గల్లంతైంది.


ఇవి కూడా చదవండి...

Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు

Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 22 , 2024 | 03:31 PM