I-Phone: ఐ-ఫోన్ పిచ్చి.. ఏం చేశాడంటే..?
ABN, Publish Date - Aug 18 , 2024 | 10:00 PM
ఫోన్లలో రారాజు ఐ-ఫోన్. మొబైల్ ధర కూడా అంతేలా ఉంటుంది. మంచి ఫీచర్స్, యాంటీ వైరస్ ఉండటంతో సాధారణ ఫోన్ల కన్నా రెట్టింపు ధర ఉంటుంది. కొత్త మోడల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఐ ఫోన్ లవర్స్ వెయిట్ చేసి మరి కొనుగోలు చేస్తారు. ఐ ఫోన్ అనేది స్టేటస్ సింబల్. మిడిల్ క్లాస్ పీపుల్ కొనడం, వాడటం సాధ్యం కాదు. మరి పూలు విక్రయించే వారు కొనడం సాధ్యమేనా.. లేదు.. కానీ ఓ యువకుడు మొబైల్ కోసం పట్టుబట్టాడు.

పూలు విక్రయిస్తూ..
ఆ యువకుడి తల్లి గుడి వద్ద పూలు విక్రయిస్తోంది. ఆమెకు కుమారుడు ఉన్నాడు. యువకుడికి ఐ ఫోన్ పిచ్చి పట్టుకుంది. మొబైల్ కొనుగోలు చేయాలని తల్లిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫోన్ అంటే ఫర్లేదు.. కానీ మొబైల్ ధర తెలిసి షాక్‌నకు గురైంది. వద్దులే అని చెప్పింది. కుమారుడు వినిపించుకోలే.. అతనికి ఉన్న ఏకైక అస్త్రం ప్రయోగించాడు. అన్నం తినడం మానేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. మూడు రోజుల నుంచి అన్నం తినడం లేదు. దాంతో చేసేదేమీ లేక ఐ ఫోన్ కొనిచ్చేందుకు ఆ తల్లి ఒప్పుకుంది. మొబైల్ కోసం ఇచ్చిన డబ్బులను సంపాదించి పెట్టాలని కుమారుడికి షరతు విధించింది. అందుకు కుమారుడు అంగీకరించడంతో కల నెరవేరింది.
షాపునకు రాగా..?
మొబైల్ కొనుగోలు చేసేందుకు తల్లి, కుమారుడు వచ్చారు. ఐ ఫోన్ కొనుగోలు చేసేందుకు రాగా ఇంటర్వ్యూ చేశారు. వారి గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. ‘నేను గుడి బయట పూలు విక్రయిస్తా. ఐ ఫోన్ కావాలని కొడుకు అడిగాడు. అంత డబ్బు పెట్టలేమని చెప్పా. గత మూడురోజుల నుంచి అన్నం తినడం మానేశాడు. ఆ క్రమంలో మొబైల్ కొనేందుకు ఇక్కడికి వచ్చా అని’ ఆ తల్లి వివరించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ యువకుడి తీరును నెటిజన్లు తప్పు పట్టారు.
కష్టం తెలియదు
యువత విలువ, ప్రాధాన్యం లేకుండా ఉంటున్నారు. అందుకోసమే ఇలా కోరికలు కోరుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల వద్ద ఇంత డబ్బు ఉండదు. నా కొడుకు అన్నం తినడం మానేస్తే.. నా సరుకులు మిగిలిపోతాయి అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. ఆ తల్లిని చూస్తే జాలి వేస్తోంది. కుమారుడికి మాత్రం అదేం పట్టదు. ఆ డబ్బుల కోసం తల్లి ఎంత కష్టపడిందో తెలియడం లేదని మరొకరు రాసుకొచ్చారు.
Also Read: Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 18 , 2024 | 10:20 PM