ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget : అన్ని వర్గాల శ్రేయస్సుకు అండ!

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:37 AM

కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్‌ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ

పేదల నుంచి రైతుల వరకు అందరినీ బలోపేతం చేసే బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్‌ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ మధ్యతరగతి, గ్రామీణులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారినీ బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని ఓ వీడియో సందేశం ఇచ్చారు. గడిచిన పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌ నూతన మధ్యతరగతికి మరింత సాధికారతను అందిస్తుందన్నారు. అదేవిధంగా యువతకు అపార అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యం వంటివి సరికొత్తస్థాయిలో చేరువ అవుతాయన్నారు. ఎంఎ్‌సఎంఈల ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. మహిళలకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు. దళితులు, బీసీలు, గిరిజనులను బలోపేతం చేయడమే లక్ష్యంగా బలమైన పథకాలను ఈ బడ్జెట్‌ అందించిందన్నారు. ముఖ్యంగా నూతన మధ్యతరగతి వర్గాన్ని అన్ని విధాలా ఈ బడ్జెట్‌ బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక భాగస్వామ్య సహకారానికి ఈ బడ్జెట్‌ హామీ ఇస్తోందన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం(ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ స్కీం) దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహద పడుతుందని వివరించారు. ‘‘భారత రక్షణరంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా పర్యాటక రంగానికి భారీ ఊతమిచ్చింది. స్టార్ట్‌పలు, సృజనాత్మక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నూతన అవకాశాలను బడ్జెట్‌ పెంపొందించింది’’ అని పేర్కొన్నారు.

ప్రజానుకూల.. అభివృద్ధి బడ్జెట్‌: అమిత్‌షా

కేంద్రబడ్జెట్‌.. ప్రజానుకూల, అభివృద్ధి బడ్జెట్‌ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆశావహ, నూతన అవకాశాలతో భారత్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. యువత, మహిళలు, రైతులకు బడ్జెట్‌ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు సరికొత్త అవకాశాలు కల్పించిందన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<