ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలం పొడిగింపు

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:33 PM

క్రమ్ మిస్రీ పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియాల్సి ఉందని, అయితే ఎఫ్ఆర్ 56 (డీ) ప్రకారం 2026 జూలై 14వ తేదీ వరకూ కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ కానీ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్స్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది.

న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూలై 14వ తేదీ వరకూ ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కమిటీ ఆమోదించినట్టు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Viral Video: ప్రధాని బ్యాగ్ కూడా ఇలాగే తనిఖీ చేస్తారా? ఈసీ అధికారులతో ఉద్ధవ్ వాగ్వాదం


విక్రమ్ మిస్రీ పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియాల్సి ఉందని, అయితే ఎఫ్ఆర్ 56 (డీ) ప్రకారం 2026 జూలై 14వ తేదీ వరకూ కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ కానీ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్స్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన సేవలను పొడిగించినట్టు తెలిపింది.


ముగ్గురు పీఎంలకు సేవలందించిన మిస్రీ

ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) 1989 బ్యాచ్ అధికారి అయిన మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో భారత దౌత్యవేత్తగా ఉన్న వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన విదేశాంగ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. కాగా మిస్రీ... ఢిల్లీ హిందూ కాలేజ్ యూనివర్శిటీలో హిస్టరీ‌లో గ్రాడ్యుయేట్‌ చేశారు. అనంతరం జంషెడ్‌పూర్‌లోని ఎక్స్‌ఎల్ఆర్ఐలో ఎంబీఏ డిగ్రీ చేశారు. ముగ్గురు ప్రధానులు.. నరేంద్ర మోదీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, ఇందర్ కుమార్ గుజ్రాల్ వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు.


ఇవి కూడా చదవండి..

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

For National news And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 09:37 PM