ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raaj kumar Anand: అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఢిల్లీ మాజీ మంత్రి

ABN, Publish Date - Jun 14 , 2024 | 06:26 PM

ఢిల్లీ మాజీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై 'అనర్హత' వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారంనాడు తెలిపారు. 'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖతో సహా పలు శాఖలను ఆనంద్ గతంలో నిర్వహించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ (Raaj Kumar Anand) అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై 'అనర్హత' వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారంనాడు తెలిపారు. జూన్ 11న తమ ముందు హాజరుకావాలని 10వ తేదీన నోటీసు ఇచ్చామని, ఆయన హాజరుకాలేదని గోయెల్ తెలిపారు. మరో అవకాశంగా జూన్ 14న హాజరుకమ్మని కోరినా స్పందించ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.

JDU on LS Speaker: లోక్‌సభ స్పీకర్ పదవిపై జేడీయూ వైఖరి ఇదే...


'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖతో సహా పలు శాఖలను ఆనంద్ నిర్వహించారు. గత ఏప్రిల్‌లో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ ఆయన ఆరోపించారు. పార్టీ అగనాయకత్వంలో వారికి చోటు లేదన్నారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మేలో ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 06:29 PM

Advertising
Advertising